Sunday, March 22, 2026 03:51 AM
Sunday, March 22, 2026 03:51 AM

పది నిమిషాలు నడిస్తే డైట్ అవసరం లేదా..?

షుగర్ లెవల్ కంట్రోల్ చేసుకోవడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారు. ఫుడ్ లో మార్పులతో పాటుగా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి నిపుణులు ఓ సూచన చేస్తున్నారు. బ్లడ్ లో షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకోవడానికి నడక అనేది చాలా ముఖ్యమట. దీని ద్వారా నరాలు దెబ్బతినడం, మూత్రపిండాల వ్యాధి, హృదయ సంబంధ సమస్యలు వంటి సమస్యలను నివారించవచ్చు. మధుమేహం లేనివారికి, రక్తంలో షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకోవడం అనేది మంచి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

Also Read : బ్రేకింగ్: టి20 కెప్టెన్ మార్పు..?

మనలో సామర్ధ్యం, మానసిక స్థితి, పని తీరు వంటివి ఇది ప్రభావితం చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే.. చిరాకు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఆహారంలో మార్పులు, జీవనశైలి మార్పులు ఆరోగ్యకరమైన రక్తంలో షుగర్ లెవెల్స్ ను గణనీయంగా ప్రోత్సహిస్తాయి. తాజాగా దీనిపై ఎయిమ్స్, హార్వర్డ్ మరియు స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాలలో ప్రాక్టీస్ చేసిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి పలు కీలక సూచనలు చేసారు. ఆహారంలో ఎటువంటి తీవ్రమైన మార్పులు చేయకుండా రక్తంలో షుగర్ ను కంట్రోల్ చేసే సూచనలు చేసారు.

Also Read : మళ్లీ తెరపైకి వైఎస్ఆర్ బొమ్మ..!

భోజనం తర్వాత పది నిమిషాల నడక అనేది షుగర్ ను చాలా కంట్రోల్ చేస్తుంది. ఇది ఒక అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యానికి మంచిదని సూచించారు. కండరాలపై ప్రభావం పడితే షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. నడవడం లేదా ఇతర శారీరక శ్రమ ద్వారా షుగర్ కంట్రోల్ చేయవచ్చు. నడిస్తే.. కండరాలు గ్లూకోజ్ ను ఉపయోగపడటంలో సహాయ పడతాయి. అలాగే ఇన్సులిన్ ను సమర్ధవంతంగా వాడుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే మంచి జీర్ణ క్రియకు ఇది సహకారం అందిస్తుంది. మీ కాళ్ళ కండరాలు స్పాంజిలా పనిచేస్తాయి. అవి కదిలినప్పుడు, అవి మీ రక్తప్రవాహం నుండి నేరుగా గ్లూకోజ్‌ను బయటకు లాగుతాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్