వలసల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇటీవల హెచ్ 1 బీ వీసాల విషయంలో భారీగా అప్లికేషన్ ఫీజులను పెంచిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. హెచ్ 1 బీ పర్మిట్ ఉన్న యజమానులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అలాగే వీసా తీసుకోవాలి అనుకునే వాళ్ళ అర్హత ఏంటీ అనే అంశాలకు సంబంధించి సరికొత్త నిబంధనలను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read : చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
అలాగే రీ ఫండ్ విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు ఉండవచ్చని సమాచారం. అలాగే నిబంధనలను ఉల్లంఘించిన యజమానులకు జరిమానాలు విధించడం వంటి అంశాలను కూడా పరిశీలిస్తోంది. అలాగే ఏయే రంగాలకు హెచ్ 1 బీ ఇవ్వాలి అనే అంశంలో కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఇక అమెరికాలో అడుగు పెట్టిన తర్వాత డిపెండెంట్ ల ఉద్యోగాలకు సంబంధించి కూడా నిబంధనలను మార్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. డిసెంబర్ నాటికి మార్పులు ఉండే సూచనలు కనపడుతున్నాయి.
Also Read : కెప్టెన్ పదవి పై సమాచారం ఉంది.. గిల్ కామెంట్స్..!
వయసు పరిమితి విషయంలో కసరత్తు చేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇక అమెరికాలో ఉండి హెచ్ 1 బీ వీసా వేసుకోవాలి అనుకునే వాళ్లకు కూడా షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక వేతనాల విషయంలో కూడా కొన్ని మార్పులు ఉండే అవకాశం కనపడుతోంది. ఎక్కువగా ఐటీ ఉద్యోగస్తులకు మాత్రమే హెచ్ 1 బీ వేస్తున్నారు. ఇతర రంగాలకు పరిమితి పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే వీసాల పరిమితి 65 వేలు ఉండగా వాటిని తగ్గించే యోచనలో ఉన్నట్టు ఇమ్మిగ్రేషన్ వర్గాలు అంటున్నాయి.