Sunday, October 19, 2025 03:37 PM
Sunday, October 19, 2025 03:37 PM
roots

ట్రంప్ బాటలో యూకే..? విదేశీ విద్యార్థులకు షాక్ తప్పదా..?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడుతుంది. విదేశీ విద్యార్థుల విషయంలో, హెచ్ 1 బి వీసాల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో వీటిని కొన్ని దేశాలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేశాయి. మరికొన్ని దేశాలు ట్రంప్ విధానాలను తాము కూడా కొనసాగించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలో యూకే కూడా చేరినట్లుగా కనబడుతోంది.

Also Read : మోహన్ బాబుకు ఏపీ సర్కార్ ఝలక్..!

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం యూకే యూనివర్సిటీలు త్వరలో కీలక నిర్ణయం తీసుకునే సంకేతాలు ఉన్నాయి. ప్రస్తుతం యూకే లో భారత విద్యార్థుల సంఖ్య భారీగా ఉంది. ఇక చదువు పూర్తయిన తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసాల తో పెద్ద ఎత్తున అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి తోడు పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో యూకేలో మరి కొంతమంది భారీగా సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అటు అమెరికా వీసా రాని ఇతర దేశాల వారు కూడా ఎక్కువగా యూకే వెళుతూ ఉంటారు.

అయితే ఇప్పుడు అక్కడి యూనివర్సిటీల ఫీజులను భారీగా పెంచే ఆలోచనలో ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా తర్వాత భారీగా యూకే వీసాలను జారీ చేసింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పోలిస్తే యూకే వీసా రావడం కాస్త సులువే. ఇదే ఆ దేశానికి కాస్త ప్రమాదకరంగా మారటమే కాకుండా.. అక్కడ యువతను నిరుద్యోగులుగా మారుస్తోంది అనే విమర్శలు వినపడుతున్నాయి. ఇటీవల వర్క్ వీసా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్న ఆ దేశం.. ఇప్పుడు ఫీజులను భారీగా పెంచే దిశగా యూనివర్సిటీలకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

Also Read : బ్రేకింగ్: నిన్న నో.. నేడు ఎస్.. మరో కరూర్ కి పోలీసులు రెడీ నా ?

అదే సమయంలో విదేశీ విద్యార్థుల కోటాను కూడా తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశ యూనివర్సిటీలకు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్న యూకే త్వరలో షాక్ ఇచ్చే సూచనలు కనబడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఉన్నవారికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా భవిష్యత్తులో వెళ్లే వారికి మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురు కానున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్