ఆస్ట్రేలియా పర్యటన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కి రిటైర్మెంట్ టూర్ కానుందా..? అంటే అవుననే అంటున్నాయి భారత క్రికెట్ వర్గాలు. ప్రస్తుతం భారత జట్టులో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కోహ్లీ కొనసాగేందుకు ఆసక్తి చూపించడం లేదని క్రీడా వర్గాలు అంటున్నాయి. విరాట్ కోహ్లీ విషయంలో అలాగే రోహిత్ శర్మ విషయంలో జట్టు యాజమాన్యంతో పాటుగా సెలెక్టర్లు అనుసరిస్తున్న వైఖరి తీవ్ర వివాదాస్పదమవుతుంది. కోహ్లీని అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణల సైతం ఉన్నాయి.
Also Read : భారత్ – పాక్ ను బెదిరించా.. అమెరికాకు బిలియన్ డాలర్ల ఆదాయం..!
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైఖరి పై అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో కోహ్లీ పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాలో 3 వన్డేల తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో రెండేళ్ల పాటు ఐపీఎల్ మాత్రమే ఆడి ఆ తర్వాత పూర్తిస్థాయిలో క్రికెట్ నుంచి దూరం కావటానికి కోహ్లీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకునే విషయంలో బోర్డు పెద్దలు ఒత్తిడి చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.
Also Read : వన్డే సీరీస్ కు ముందు ఆసిస్ కు షాక్..!
ఇక తాను ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రిటైర్ అవుతానని జట్టు యాజమాన్యానికి కోహ్లీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అటు రోహిత్ శర్మతో కూడా తాను రిటైర్ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు కోహ్లీ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం లండన్ లో ఉంటున్న కోహ్లీ వచ్చే ఐపిఎల్ నాటికి భారత్ రానున్నాడు. ఆస్ట్రేలియా నుంచి నేరుగా లండన్ వెళ్లిపోతాడని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అటు కోహ్లీ తో పాటుగా మరో ఆటగాడు కూడా వన్డే ల నుంచి రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే రోహిత్ శర్మ మాత్రం వచ్చే ఏడాది వరకు కొనసాగే సూచనలు ఉన్నాయి.