హీరో విజయ్ దేవరకొండ కారు నిన్న గద్వాల్ సమీపంలో ప్రమాదానికి గురైన ఘటన సినీ అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. అయితే అదృష్టవశాత్తు ఆయనకే కాకుండా కుటుంబ సభ్యులకూ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ కారు ముందు భాగం మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో లీకై కాసేపట్లో వైరల్ అయ్యాయి. ఈ కారు నెంబర్ కనిపించడంతో కొంతమంది నెటిజన్లు వెంటనే ఆ కారు పై ఎలాంటి చలాన్స్ ఉన్నాయా అని పరిశీలించగా, విజయ్ దేవరకొండ వాహనంపై ఇటీవలే ఓ స్పీడ్ చలాన్ ఉన్నట్లు తేలింది.
Also Read : డిజిటల్ బుక్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు
తెలంగాణ ఈ-చలాన్ పోర్టల్ ప్రకారం, ఆయన కారు ఆదివారం రోజున పుట్టపర్తికి వెళ్తున్నప్పుడు గద్వాల్ జిల్లా ఉండవల్లి వద్ద 114 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినందుకు రూ.1035 ఫైన్ పడింది. ఆ ఫైన్‌ను ఆయన చెల్లించినట్లు కూడా రికార్డులు చూపుతున్నాయి. ప్రస్తుతం ఆయన పేరు మీద ఎలాంటి చలాన్స్ లేవు. విజయ్ దేవరకొండ వేగం మీద మక్కువ ఉన్న డ్రైవర్ అనిపిస్తోంది. కానీ స్పీడ్ లిమిట్ ఉన్న ప్రాంతాల్లో కూడా అంత వేగంగా వెళ్లడం సరికాదు అని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. “ఈ ప్రమాదం చిన్న హెచ్చరిక మాత్రమే. ఇకపై జాగ్రత్తగా ఉండాలి” అంటూ అభిమానులు ఆయనను ట్యాగ్ చేసి పోస్ట్‌లు చేస్తున్నారు.
Also Read : ఆ ఇద్దరే జగన్ టార్గెట్..!
ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవల విడుదలైన కింగ్డమ్ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన కెరీర్‌పై మరింత ఒత్తిడి పెరిగింది. గీత గోవిందం తరువాత సరైన హిట్ దక్కకపోవడంతో ఆయన ఫ్లాప్‌ల పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ‘శ్యామ్ సింగరాయ్’ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియడ్ నేపథ్య చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది మరియు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే, రీసెంట్‌గా హీరోయిన్ రష్మిక మందన్నాతో ఆయన నిశ్చితార్థం జరిగినట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే వీళ్లిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.