Sunday, October 19, 2025 08:15 PM
Sunday, October 19, 2025 08:15 PM
roots

ఆ ముగ్గురినీ వేటాడుతున్న బోర్డు..?

టీమిండియా సీనియర్ ఆటగాళ్ల విషయంలో సెలెక్షన్ కమిటీ అలాగే క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అనుసరిస్తున్న వైఖరి వివాదాస్పదంగా మారుతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలో తాజాగా సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో ఫాన్స్ మండిపడుతున్నారు. 2027 ప్రపంచ కప్ ప్లాన్ లో వీళ్ళిద్దరూ లేరు అంటూ కామెంట్ చేశాడు అగర్కర్. వాస్తవానికి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ వచ్చే వరల్డ్ కప్ వరకు ఆడే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

Also Read : బెజవాడలో తగ్గని రద్దీ.. ఆశ్చర్యపోతున్న అధికారులు

దీనికి సంబంధించి బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా క్లారిటీ ఇచ్చారు. వచ్చే వరల్డ్ కప్ వరకు వాళ్లు ఆడతారు అంటూ కామెంట్ చేశారు. కానీ తాజాగా సెలక్షన్ కమిటీ చైర్మన్ మాత్రం వాళ్ళిద్దరి విషయంలో చేసిన కామెంట్ మరోసారి చర్చనీయాంసంగా మారింది. దీంతో వీళ్ళిద్దరి మెడపై రిటైర్మెంట్ కత్తి వేలాడుతోందని.. క్రికెట్ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనతో పాటుగా తర్వాత జరగబోయే సిరీస్ లలో కూడా వీళ్ళిద్దరూ రాణించాల్సి ఉంటుంది. వాస్తవానికి గత ఏడాది ఆస్ట్రేలియా పై జరిగిన టెస్ట్ సిరీస్ లో వీళ్ళిద్దరూ.. సరైన ప్రదర్శన చేయలేదు.

Also Read : గర్భంతో ఉన్న మహిళలు మద్యం సేవించవచ్చా..?

కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపించింది. ఇక ఇప్పుడు జరగబోయే వన్డే సిరీస్ లో రాణించకపోతే మాత్రం.. ఇద్దరికీ ఇదే ఆఖరి సిరీస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వీరితోపాటుగా బౌలర్ జస్ప్రీత్ బూమ్రా విషయంలో కూడా ఓ కన్నేసి ఉంచింది బోర్డు. ఇంగ్లాండ్ పర్యటనలో అతను పూర్తిస్థాయిలో ఆడలేదు. దానికి తోడు ఫామ్ కూడా పేలవంగానే ఉంది. ఆసియా కప్ లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు మెరుగ్గా రాణించారు. కాబట్టి ఆస్ట్రేలియా పర్యటనలో ఎంత మేర రాణిస్తారు అనే దానిపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్