Monday, October 20, 2025 01:09 AM
Monday, October 20, 2025 01:09 AM
roots

మమ్మల్ని కూడా గుర్తించండి సార్..!

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటింది. ఓ వైపు పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. మరోవైపు అమరావతి నిర్మాణం నిర్విరామంగా కొనసాగుతోందని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అని అధినేత సహా ఇతర నేతలంతా పదే పదే చెబుతున్నారు. అయితే క్యాడర్ మాత్రం ఒక విషయంలో నిరుత్సాహంతో ఉంది.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రధానంగా కృషి చేసింది కార్యకర్త మాత్రమే. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి టీడీపీ కార్యకర్త నరకం చూశాడనేది వాస్తవం. అక్రమ కేసులు, దాడులు, ఆస్తుల విధ్వంసం, చీత్కారాలు, చీదరింపులు, అవమానాలతో టీడీపీ కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే.. తమను వైసీపీ నేతలు చంపేస్తారని పలువురు టీడీపీ కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అటు వైసీపీ నేతలు కూడా తాము గెలిచిన తర్వాత కర్రలతో వెంటపడతాం అని ఎన్నికల ప్రచారంలోనే వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గెలవకూడదు అనే కసితో టీడీపీ కార్యకర్తలు పని చేశారు.

Also Read : తమిళ నాడు స్టాలిన్, వైసీపీ చీఫ్ జగన్ కు బాంబు వార్నింగ్..!

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కార్యకర్త సంతోషపడ్డాడు. తమకు మంచి జరుగుతుందని ఆశపడ్డాడు. అలాగే తమ గోడును నేరుగా అధినేతను విన్నవించుకోవచ్చనుకున్నాడు. కానీ ప్రస్తుతం పార్టీ కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నానా పాట్లు పడుతున్నారు. ఇందుకు అధినేత చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ వ్యవహరిస్తున్న తీరును ఉదాహరిస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారంలో 5 రోజుల పాటు చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు, నేతలకు అందుబాటులో ఉన్నారు. ప్రతి రోజు దాదాపు 6 గంటల పాటు పార్టీ కార్యకర్తలతో గడిపారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారికి భరోసా కల్పించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు.. దాదాపు రెండు నెలలుగా పార్టీ ఆఫీసు ముఖం చూడలేదు. అసెంబ్లీ, సచివాలయం, జిల్లాల పర్యటన, ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షలు.. అంతే తప్ప కార్యకర్తలకు సమయం కేటాయించడం లేదు. ఇక పార్టీ ఆఫీసుకు కూడా పొలిట్‌బ్యూరో సమావేశానికి మినహా మరెప్పుడు రావటం లేదు.

Also Read : 9 ఏళ్ళ తర్వాత.. తీరిన రాహుల్ దాహం..!

ఇక లోకేష్ సంగతి అయితే సరే సరి. ఆయన ఉండవల్లి ఇంట్లోనే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. మంగళగిరిలో పర్యటిస్తున్నారు తప్ప.. పార్టీ ఆఫీసు వైపు మాత్రం రావటం లేదు. అదే సమయంలో సోషల్ మీడియాలో సాయం అడిగిన వారికి లేదనకుండా చేస్తున్నారు. కానీ సొంత కార్యకర్తలకు మాత్రం సమయం కేటాయించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల పర్యటనలో కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు కదా అనే జవాబు పార్టీ నేతల నుంచి వస్తుంది. అయితే ఆ మీటింగ్‌కు అందరినీ అనుమతించటం లేదంటున్నారు. దీని వల్ల నిజమైన కార్యకర్తలు నష్టపోతున్నారనే మాట వినిపిస్తోంది.

చంద్రబాబు ఇటీవల చాలా బిజీగా గడిపేస్తున్నారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీలో పర్యటించారు. వీటితో పాటు డీఎస్సీ అభ్యర్థులతో భేటీ, పింఛన్ పంపిణీ వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అయినా సరే.. కార్యకర్తలను నేరుగా కలవటం లేదనే మాట వినిపిస్తోంది. కనీసం రెండు వారాలకు ఒకరోజు అయినా సరే.. పార్టీ కార్యాలయానికి వచ్చి.. తమ సమస్యలు వినాలని సీనియర్ నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. 2019 ఫలితం రిపీట్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్