ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ ఓడిపోవడం ఏమో గాని ఇప్పుడు ఆ జట్టు నానా కష్టాలు ఎదుర్కొంటోంది. స్వదేశంలో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ జట్టు.. ఇప్పుడు మరో పరిణామం ఎదుర్కొంది. విదేశీ టి20 లీగ్‌లలో పాల్గొనే ఆటగాళ్లకు అన్ని నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ లను (NOC) నిలిపివేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటి అనేది మాత్రం వెల్లడించింది. ఎస్ఏ20, ఐఎల్టీ 20, బీబీఎల్ వంటి విదేశీ లీగ్ లు రాబోయే నెలల్లో ప్రారంభం కానున్నాయి.
Also Read : తెలంగాణాలో పింక్ బుక్ లేదు.. సోషల్ మీడియా జాగ్రత్త.. డీజీపీ సంచలన కామెంట్స్
దీనితో పాకిస్తాన్ స్టార్ ఆటగాళ్లకు ఇది ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది కంటిన్యూ అయితే మాత్రం భారీగా ఆటగాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. సెప్టెంబర్ 29న పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ సయ్యద్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రముఖ లీగ్ లలో ఆడబోతున్న బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, ఫహీమ్ అష్రఫ్ తో సహా అనేక మంది అగ్రశ్రేణి ఆటగాళ్లను ఈ నిర్ణయం ప్రభావితం చేస్తుంది. ఆసియా కప్ లో వరుసగా మూడు మ్యాచ్ లలో పాకిస్తాన్ ఓడిపోయింది.
Also Read : అమెరికా షట్ డౌన్.. ప్రమాదంలో వారి ఉద్యోగాలు..!
అంతర్జాతీయ మీడియా ప్రకారం.. ఆటగాళ్ళ ఆట తీరు అత్యంత దారుణంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి ప్రారంభయ్యే దేశవాళి క్రికెట్ లో ఆటగాళ్ళు ఆడాల్సిందే అని బోర్డు చెప్తోంది. అందుకే సర్టిఫికేట్ లను జారీ చేసే విషయంలో కీలక సవరణలు చేసే దిశగా బోర్డు అడుగులు వేస్తోంది. కొంత మంది ఆటగాళ్ళు లీగ్ లపై పెట్టిన దృష్టి దేశంపై పెట్టడం లేదని అక్కడి మాజీ క్రికెటర్ లు ఆరోపిస్తున్నారు. ఆసియా కప్ లో పాక్ ఆట తీరు ముందు నుంచి విమర్శలకు వేదిక కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.