స్టార్ లు అయ్యే వరకు ఒక లెక్క స్టార్ అయిన తర్వాత మరో లెక్క అన్నట్టు ఉంది బాలీవుడ్ నటుల పరిస్థితి. నిర్మాతలకు చుక్కలు చూపిస్తోన్న నటుల వ్యవహారం ఇప్పుడు ఇండియన్ సినిమాలో హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ వంటి హీరోల వైఖరి ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. తాజాగా ఓ వార్త రణవీర్ సింగ్ వ్యవహారాన్ని బయటపెట్టింది. ఒకప్పుడు షూటింగ్ సమయంలో నటులకు ప్రాథమిక అవసరాలను అందించడానికి వాడిన వానిటీ వ్యాన్ లు ఇప్పుడు.. హోదాకు సిగ్నల్ గా మారిపోయాయి.
Also Read : మెగా ఫ్యాన్స్ ను కూల్ చేసిన పవన్ జ్వరం..!
ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ప్రచురించిన ఓ కథనంలో రణవీర్ సింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వానిటీ వ్యాన్ విక్రేత కేతన్ రావల్ మాట్లాడుతూ, రణ్‌వీర్ సింగ్ షూటింగ్ షెడ్యూల్‌లో ఉన్నప్పుడు మూడు వానిటీ వ్యాన్‌లు అవసరమని చెప్పుకొచ్చాడు. ఒకటి అతని వ్యక్తిగత అవసరాల కోసం, ఒకటి జిమ్ వ్యాన్, మరోకటి అతని ప్రైవేట్ చెఫ్ కోసమని వివరించాడు. షారుఖ్ ఖాన్ వ్యానిటీ వ్యాన్ చాలా పెద్దదిగా మరియు విలాసవంతమైనదిగా ఉంటుందని, మారుమూల ప్రదేశాలలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫ్రీగా వాడలేమని చెప్పుకొచ్చాడు.
అతను ఇరుకైన ప్రదేశాలలో షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడల్లా తాను తన వ్యాన్ పంపిస్తాను అని తెలిపాడు. జాన్ అబ్రహం ఫ్లోర్-టు-సీలింగ్ విండో కోసం స్పెషల్ రిక్వస్ట్ చేసాడని, దాని లోపల భాగం మొత్తంగా నల్లగా తయారు చేసామని తెలిపాడు. ఫ్లోర్, గోడలు, సింక్, టాయిలెట్ అన్నీ నల్లగానే ఉంటాయని చెప్పాడు. ఇక వానిటీ వ్యాన్ ల భారం మొత్తం నిర్మాతలే మెయింటేన్ చేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపాడు. ఒక వ్యాన్ సగటు నిర్వహణ ఖర్చు దాదాపు రూ.10–15 లక్షలు ఉంటుందట.
Also Read : సోషల్ మీడియాపై ఏపీ పోలీసుల గురి.. తప్పుడు రాతలకు ట్రీట్మెంట్
మల్టీ రూమ్ లేఅవుట్, ఎక్కువ స్పేస్ ఉన్న వ్యాన్ ధర 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇటాలియన్ మార్బుల్, లగ్జరీ రిక్లైనర్లు, జిమ్ సౌకర్యాలతో కూడిన హై-ఎండ్ కస్టమ్ వ్యాన్ ధర రూ.75 లక్షల నుండి రూ.1 కోటి వరకు ఉంటుంది. సాధారణంగా సోఫాలు, కాంపాక్ట్ ప్యాంట్రీ, నిరాడంబరమైన వాష్‌రూమ్, టెలివిజన్‌తో కూడిన మిడ్-రేంజ్ వ్యాన్‌ల ధర రూ.35–50 లక్షలు. అదే సమయంలో, డ్రెస్సింగ్ ఏరియా, ఎయిర్ కండిషనింగ్ మాత్రమే ఉన్న బేసిక్ వ్యాన్ ధర రూ.15–20 లక్షల మధ్య ఉంటుందని తెలిపాడు. రణవీర్ భార్య దీపిక కూడా ఇదే స్థాయిలో డిమాండ్ చేస్తుందట. ఆమె ఖర్చులు భరించలేకనే టాలీవుడ్ ఆమెను పక్కన పెట్టింది.