ప్రపంచాన్ని భయపెడుతోన్న అమెరికా ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. ప్రపంచానికి పెద్దన్నగా, ఆదర్శంగా ఉన్నామని చెప్పుకునే ఆ దేశం ఇప్పుడు ఆర్ధిక సమస్యలతో కష్టాలు ఎదుర్కొంటోంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిపాలనలో రెండవ సారి షట్ డౌన్ అయింది అగ్ర రాజ్యం. డెమొక్రాట్లు తమ డిమాండ్లను పరిష్కరించకపోవడంతో.. రిపబ్లికన్ స్టాప్‌గ్యాప్ ఫండింగ్ ప్యాకేజీని అడ్డుకోవడంతో అధికారికంగా మూతపడింది. దీనితో.. ప్రభుత్వం నిధులు లేక ఇబ్బందులు పడింది. ఇక ఇక్కడి నుంచి షట్ డౌన్ చేస్తున్నామని ప్రకటించారు.
Also Read : మెగా ఫ్యాన్స్ ను కూల్ చేసిన పవన్ జ్వరం..!
భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9 గంటల తర్వాతి నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. 2018-2019లో ట్రంప్ మొదటి పదవీకాలంలో 35 రోజుల పాటు షట్ డౌన్ చేసింది అమెరికా సర్కార్. షట్‌డౌన్ వల్ల అవసరమైన కార్యకలాపాలు నిలిచిపోతాయి. అలాగే లక్షలాది మంది ఉద్యోగులకు తాత్కాలికంగా జీతాలు ఉండవు. సైనిక సిబ్బందితో సహా ముఖ్యమైన కార్మికులు జీతం లేకుండా పని చేయాల్సి ఉంటుంది. అయితే అత్యవసరం కాని ఉద్యోగులను సెలవులపై పంపిస్తుంది.
Also Read : భారీగా నిధులు ఇవ్వండి.. నిర్మలకు చంద్రబాబు విజ్ఞప్తి
నిష్పక్షపాతంగా పనిచేసే కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనాల ప్రకారం, తాత్కాలికంగా 7 లక్షల 50 వేల మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. అయితే వైట్ హౌస్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. చాలా మంది ఉద్యోగాలు పోయే అవకాశాలు కనపడుతున్నాయి. నిధుల కొరత ఏర్పడినప్పుడు, చట్టం ప్రకారం సమాఖ్య సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేయాలి. నాసా అంతరిక్ష కార్యకలాపాలు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మరియు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వంటి విధులు, వలసలను నియంత్రించే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలు మాత్రం కంటిన్యూ అవుతాయి. ఈ షట్‌డౌన్ వల్ల ప్రతి వారం ఆర్థిక వృద్ధిలో 0.1 నుండి 0.2 శాతం పాయింట్లు తగ్గవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.