ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. దీనితో ఉభయ సభల్లో జరుగుతోన్న చర్చలు ఆసక్తిని రేపుతున్నాయి. నేడు శాంతి భద్రతలపై చర్చ జరగగా.. సిఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అలాగే పలు బిల్లులను కూడా ప్రవేశ పెట్టారు. ఇదిలా ఉంటే సభలో నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వంలో సినిమా వాళ్లకు ఎదురైన పరిస్థితులను గుర్తు చేసుకున్న బాలయ్య, మాజీ సిఎం జగన్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసారు.
Also Read : విజయవాడ ఎక్స్ పో చీఫ్ గెస్ట్..?
సినీ పరిశ్రమలో పెద్దలు అందరూ జగన్ ను కలవడానికి వెళితే ఆ సైకో సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాలన్నారు అంటూ సంచలన కామెంట్స్ చేసారు. జగన్ ను సైకో అని సంబోధించడం సభలో హాట్ టాపిక్ అయింది. అప్పుడు చిరంజీవి గట్టిగా అడిగారని గుర్తు చేసారు. సీఎంను కలవడానికి వచ్చారనడం సరికాదని అసహనం వ్యక్తం చేసారు. చిరంజీవిని అవమానించారనడం వరకూ వాస్తవమేనని ఆ నాటి పరిస్థితులను వివరించారు. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే గట్టిగా ఎవరూ అడగలేదని మండిపడ్డారు.
Also Read : పాక్ క్రికెటర్లకు భారత్ షాక్..!
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా వైరల్ అవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో సినిమా వాళ్ళ విషయంలో అప్పటి సిఎం జగన్ అనుసరించిన వైఖరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టికెట్ ధరలను భారీగా తగ్గించడంపై సినిమా పరిశ్రమ ఆవేదన వ్యక్తం చేసింది. పలు థియేటర్ లను కూడా మూసివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జగన్ ను కలిసేందుకు సినిమా పెద్దలు వెళ్ళగా.. వాళ్ళను జగన్ నడిపించడం, చిరంజీవి దండం పెట్టి జగన్ ను వేడుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.