ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాంతి భద్రతల అంశంపై చర్చ జరగగా.. సిఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడారు సిఎం. గతంలో నాపై ఎవరూ తప్పుడు కేసులు పెట్టలేదని, ఏ తప్పు చేయను కావున నాపై కేసులు పెట్టేందుకు భయపడతారన్నారు. తాను తప్పు చేయనని న్యాయబద్దంగా ఉంటాను అన్నారు. ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తానన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాపై 17 కేసులు పెట్టారని గుర్తు చేసారు.
Also Read : మరో భారత్.. పాక్ పోరు చూస్తామా..?
నాపై ఎందుకు కేసులు పెట్టారని అడిగితే సమాధానం ఉండదన్న ఆయన గత ప్రభుత్వంలో అందరూ బాధితులే అన్నారు. కేసు వివరాలు వాట్సప్‌లో పంపిస్తామనడం అరాచకాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. లోకేష్, కొల్లు రవీంద్ర, బీసీ జనార్ధన్ రెడ్డి, ధూళిపాళ్లపై కేసులు పెట్టారని, జేసీ ప్రభాకర్ రెడ్డిపై 66 కేసులు పెట్టారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై 2,500కు పైగా కేసులు పెట్టారన్నారు. పులివర్తి నానిపై 31 కేసులు, చింతమనేని ప్రభాకర్ పై 40కి పైగా కేసులు పెట్టారని సభలో గుర్తు చేసారు చంద్రబాబు.
Also Read : పాక్ క్రికెటర్లకు భారత్ షాక్..!
ఎవరితో పరుషంగా మాట్లాడని నిమ్మల రామానాయుడుపై 20 కేసులు పెట్టారని, దేవినేని ఉమపై 27, ఆంజనేయులుపై 16, అయ్యన్నపై 14 కేసులు నమోదు అయినట్టు తెలిపారు. బీటెక్ రవిపై 14, కూన రవికుమార్‌పై 15, కాల్వ శ్రీనివాసులుపై 14 కేసులు నమోదు అయ్యాయని, రఘురామకృష్ణరాజును జైలులో చిత్రహింసలకు గురిచేశారని మండిపడ్డారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని 45 సార్లు అరెస్టు చేశారని, రాజధాని మహిళా రైతుల ఇళ్ల బాత్రూమ్ లపై డ్రోన్లు ఎగురవేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం చేపడితే ఎక్కడికక్కడ అడ్డుకున్నారని ఆ నాటి పరిస్థితులను గుర్తు చేసారు. సింగపూర్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసి భయపెట్టారన్నారు.