ఆసియా కప్ లో మరో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సాధ్యమవుతుందా..? అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్ లలో ఈ రెండు జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో మ్యాచ్ కు కూడా అవకాశాలు కనపడుతున్నాయి. బుధవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడంతో భారత్.. ఫైనల్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. దీనితో భారత్ తో తలపడే జట్లు ఏవీ అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read : అయ్యర్ కు ఏమైంది..? జట్టు నుంచి సడెన్ గా..!
బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించడంతో శ్రీలంక ఎలిమినేట్ అయింది. దీనితో భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ నామమాత్రంగా మారింది. ఇక గురువారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే సూపర్ 4 మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది. సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాక్ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిస్తేనే ఫైనల్ కు చేరుకుంటుంది. అప్పుడు 2 మ్యాచ్ లలో 4 పాయింట్లతో పాక్ ఫైనల్ కు చేరుకుంటుంది. బంగ్లాదేశ్ విషయంలో కూడా ఇదే పరిస్థితి.
Also Read : సూర్య వంశీ సరికొత్త రికార్డ్..!
ఇప్పటికే రెండు మ్యాచుల్లో బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లు సాధించింది. కాబట్టి పాకిస్తాన్ పై గెలిస్తే మాత్రమే ఫైనల్ కు చేరుకుంటుంది. దాదాపుగా బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ విజయం సాధించడం ఖాయంగా కనపడుతోంది. అయితే భారత్ పై పోరులో బంగ్లాదేశ్ ఆట.. వారి స్థాయిని మించి ఉండటంతో మ్యాచ్ లో పాకిస్తాన్ కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్ లో తప్పక గెలుస్తామని పాకిస్తాన్ ధీమా వ్యక్తం చేస్తోంది.