అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్తాన్ క్రికెటర్ల చేష్టల విషయంలో తీవ్ర విమర్శలు మనం వింటూనే ఉంటాం. ఆటలో లేని స్కిల్ చేష్టల్లో చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా భారత్ తో మ్యాచ్ అనగానే వారి హావ భావాలు క్రికెట్ ప్రేమికులను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. గత వారం భారత్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాళ్ళు హారిస్ రాఫూఫ్, ఫర్హాన్ చేష్టలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. గత ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో రెచ్చగొట్టే విధంగా హావభావాలు ప్రదర్శించారు.
Also Read : సూర్య వంశీ సరికొత్త రికార్డ్..!
దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసిసికి అధికారికంగా ఫిర్యాదు చేసింది. బుధవారం వీరిద్దరిపై బిసిసిఐ ఫిర్యాదు చేసిందని భారత క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఐసిసికి ఈ మెయిల్ చేసింది బోర్డు. దీనిపై ఐసిసి విచారణ జరపడం ఖాయంగా కనపడుతోంది. దీనితో ఆ ఇద్దరు ఐసిసి ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు సంఘీభావం తెలిపినందుకు, ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న భారత సాయుధ దళాలకు తన జట్టు విజయాన్ని అంకితం చేసినందుకు గానూ, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు చేయడం గమనార్హం.
Also Read : భారత్ మనతోనే ఉంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన కామెంట్స్
ఇక మైదానంలో కోహ్లీ, కోహ్లీ అని నినాదాలు చేసిన ఫ్యాన్స్ ను ఉద్దేశించి, హారిస్ రవూఫ్.. భారత వైమానిక దళాన్ని అవమానించే విధంగా మైదానంలో చేష్టలు చేసాడు. ఇక ఫర్హాన్ విషయానికి వస్తే తన బ్యాట్ ను గన్ మాదిరిగా చూపిస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు. దీనిపై కూడా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ఆసియా కప్ టోర్నీ విషయానికి వస్తే బంగ్లాదేశ్ పై ఘన విజయంతో భారత్ నేరుగా ఫైనల్ లో అడుగుపెట్టింది.