ఏళ్ళ తరబడి సాగుతోన్న ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో రష్యాకు భారత్ సహకారం అందిస్తోందనే ఆరోపణలు చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలేన్ స్కీ షాక్ ఇచ్చారు. భారత్ తమ వైపే ఉందని స్పష్టం చేసారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో ట్రంప్ గంట పాటు ప్రసంగం చేయగా.. దానికి జేలేన్ స్కీ కౌంటర్ ఇచ్చారు. భారత్ విషయంలో తమకు ఏ అనుమానాలు లేవని, యుద్దాన్ని ముగించే విషయంలో కొన్ని శక్తివంతమైన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : రాజీనామాలు చేసేద్దాం..? జగన్ సంచలన నిర్ణయం..?
యుద్దాన్ని ముగించే విషయంలో తాను సానుకూలంగా ఉన్నానని ఆయన స్పష్టం చేసారు. ఫాక్స్ న్యూస్ యాంకర్ బ్రెట్ బేయర్ తో కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ అధ్యక్షుడు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడారు. ట్రంప్ పై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ముందుకు ఉన్న సవాళ్లను చర్చించారు. వాటిని పరిష్కరించే సామర్ధ్యం ట్రంప్ కు ఉందని వ్యాఖ్యానించారు. ఇక భారత్ ను పదే పదే ఈ అంశంలో లాగడం మంచిది కాదని, భారత్ ను ఒత్తిడి చేయడం కూడా కరెక్ట్ కాదన్నారు.
Also Read : తప్పుడు ప్రచారం ఖాతాలపై గురి.. తొక్కి పట్టి నార తీస్తున్న పోలీసులు
రష్యాతో ఇంధన ఒప్పందం విషయంలో భారత్ తన విధానాన్ని మార్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు. తమకు మద్దతు ఇచ్చే దేశాల గురించి కూడా ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ ఎప్పుడూ తమకు మద్దతు ఇవ్వదని, దానికి ప్రధాన కారణం ఇరాన్ కు అమెరికాకు మధ్య ఉన్న విభేదాలేనన్నారు. యూరప్ దేశాలతో భారత్ కు మంచి సంబంధాలు కావాలని, మిగిలిన యూరప్ దేశాలు కూడా భారత్ తో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ యుద్దంలో గెలవలెను అనే క్లారిటీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఉందన్నారు.