2019 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. నిందితులు ఎవరో క్లారిటీ ఉన్నా సిబిఐ అధికారులు వారిని అరెస్టు చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఈ వ్యవహారంలో అప్పట్లో పోలీసులపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. పలువురు పోలీసులు నిందితులకు సహకరించారు అని ఆరోపణలు వినిపించాయి. ఇక తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సిఐ శంకరయ్య చేసిన ప్రకటన సంచలనమైంది. తనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోటి 40 లక్షల రూపాయలు పరువు నష్టం చెల్లించాలంటూ ఆయన లీగల్ నోటీసులు పంపటం ఆశ్చర్యపరిచింది.
Also Read : కేసీఆర్ ప్లాన్ అమలు చేయనున్న జగన్..!
దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపటం పోలీసు వర్గాలతో పాటుగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తనపై అసత్య ఆరోపణలు చేయడం కారణంగా.. తన ప్రతిష్టకు భంగం కలిగిందని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని శంకరయ్య గతంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కోరారు. ఈ విషయమై మార్చి 3వ తేదీ, జులై 13వ తేదీ రెండు లేఖలు రాశారు. అసెంబ్లీ రికార్డులను ప్రివిలేజ్ కమిటీకి పంపించాలని, సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా అలాగే పత్రిక ప్రకటన ద్వారా తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సీఐ.
Also Read : చంద్రబాబు ముందుకు అసెంబ్లీ అటెండెన్స్..? ఎమ్మెల్యేలపై చర్యలు..?
అయితే దీనిపై ఏ విధంగానైనా స్పందన లేకపోవడంతో ఈనెల 18న చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపించారు. వివేకానంద రెడ్డి మృతదేహాన్ని ప్యాక్ చేయడంలో నిందితులకు సీఐ సహకరించారని, అందుకు ప్రతిఫలంగా శంకరయ్య పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారని, చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన శంకరయ్య.. ఈ కేసులో సిబిఐ తనపై ఏ విధమైన ఆరోపణలు చేయలేదని, కేవలం తనను సాక్షిగా మాత్రమే పరిగణించిందని శంకరయ్య పేర్కొన్నారు. తాను ఇప్పటికీ సిఐ గానే పనిచేస్తున్నానని.. రెండున్నర ఏళ్ల శాఖపరమైన దర్యాప్తు తర్వాత తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసారని.. తనపై ఈ విధమైన ఆరోపణలు చేసినందుకు చంద్రబాబు కోటి 40 లక్షల రూపాయలు తనకు చెల్లించాలని డిమాండ్ చేశారు. తనకు కలిగిన మానసిక క్షోభకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ శంకరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.