Tuesday, October 21, 2025 05:25 PM
Tuesday, October 21, 2025 05:25 PM
roots

చెర్రీ కొత్త బిజినెస్ ఏమిటో తెలుసా..?

తెలుసు సినీ పరిశ్రమలో అటు వెండితెరపైన, ఇటు వ్యాపార రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు కొణిదెల రామ్ చరణ్ తేజ్. చిరుత సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్‌తో ఆస్కార్ రేంజ్‌కు ఎదిగారు. ఓ వైపు వెండి తెరపై రికార్డుల మోత మోగిస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో కూడా దూసుకెళ్తున్నారు చెర్రి. పెట్టుబడులు పెట్టే విషయంలో చెర్రీని ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటున్నారు కూడా. ఇప్పటికే ఎన్నో రంగాల్లో పెట్టుబడులు పెట్టిన చెర్రీ.. తాజాగా కొత్త వ్యాపారంపై దృష్టి పెట్టారు.

Also Read : ఒక్కసారి కామెర్లు వస్తే ప్రమాదమేనా..? తమిళ యాక్టర్ మరణం వెనుక ఇదే కారణం..!

టాలీవుడ్‌లో బిగ్ మార్కెట్ ఉన్న హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. సెలక్టెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నారు కూడా. అదే సమయంలో తన అభిరుచికి తగినట్లుగా అడుగులు వేస్తున్నారు. ప్రముఖ వైద్యులు అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనాను చరణ్ పెళ్లి చేసుకున్నారు. పదేళ్ల పాటు వైవాహిక జీవితం ఎంజాయ్ చేసిన ఈ దంపతులకు ఇటీవలే ఓ పాప పుట్టింది.

క్లింకారతో బాగా ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పిన చరణ్.. తన మనసులో మాట బయటపెట్టారు. కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఉపాసన మెడికల్ రంగంలో రాణిస్తున్నారు. ఇక చెర్రీ కూడా హార్స్ క్లబ్‌తో పాటు ఫుడ్ బాల్ లీగ్, ఎయిర్‌‍ లైన్స్ వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించారు. తాజాగా సినీ రంగంలో పెట్టుబడులపై దృష్టి పెట్టారు. ఇప్పటికే సినీ పరిశ్రమలో బన్నీ, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, రవితేజ, విజయ్ దేవరకొండలు థియేటర్లను నిర్వహిస్తున్నారు. ఏఏఏ పేరుతో అల్లు అర్జున్, ఏఆర్‌టీ పేరుతో రవితేజ. ఏవీడీ పేరుతో విజయ్ దేవరకొండ, ఏఎంబీ పేరుతో మహేష్ బాబు, యూవీ సెల్యులాయిడ్ పేరుతో ప్రభాస్ థియేటర్ల వ్యాపారంలో ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా తారక రత్న, రామకృష్ణ పేరుతో థియేటర్ల వ్యాపారంలో ఉంది. దీంతో చెర్రీ కూడా ఈ వ్యాపారంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read : చదరంగం కాదు రణరంగమని చెప్పుకున్న బిగ్ బాస్ – కానీ ఫలితం?

మహేశ్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ మాదిరిగా ఆషియన్ కంపెనీతో భాగస్వామ్యం అవుతారా.. లేక తన మేనమాన అల్లు అరవింద్ మాదిరిగా థియేటర్లు లీజుకు తీసుకుని నిర్వహిస్తారా.. అనేది తెలియాల్సి ఉంది. థియేటర్ల వ్యాపారం పూర్తిగా ఉపాసన చూసుకుంటారనే మాట కూడా వినిపిస్తోంది. మరి దీనిపై చెర్రి దంపతులు అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తారో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

పోల్స్