Sunday, October 19, 2025 10:30 AM
Sunday, October 19, 2025 10:30 AM
roots

ఈరోజు (20-09-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయణం వర్ష ఋతువు, శుక్లపక్షం 20-09-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 20-09-2025

చిన్ననాటి మిత్రులతో కారణ కలహా సూచనలున్నవి. అనారోగ్యం సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

—————————————

వృషభం 20-09-2025

చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

—————————————

మిధునం 20-09-2025

సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగం సాగుతాయి.

—————————————

కర్కాటకం 20-09-2025

చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారా, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

—————————————

సింహం 20-09-2025

ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.

—————————————

కన్య 20-09-2025

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

—————————————

తుల 20-09-2025

బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

—————————————

వృశ్చికం 20-09-2025

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

—————————————

ధనస్సు 20-09-2025

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువక నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

—————————————

మకరం 20-09-2025

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఉహించిన ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు.

—————————————

కుంభం 20-09-2025

దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభఫలితాలు పొందుతారు.

—————————————

మీనం 20-09-2025

చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున మీ పని తీరుకు అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతుంది. వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

—————————————

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్...

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా...

పోల్స్