Tuesday, October 21, 2025 05:06 PM
Tuesday, October 21, 2025 05:06 PM
roots

ఒక్కసారి కామెర్లు వస్తే ప్రమాదమేనా..? తమిళ యాక్టర్ మరణం వెనుక ఇదే కారణం..!

ఈ రోజుల్లో మరణం ఏ రూపంలో వస్తుందో కూడా ఊహించడం అతి కష్టంగా ఉంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలపై గతంలో ఉన్న అవగాహన ఇప్పుడు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. డాక్టర్ లు కూడా గుండెపోటుతో మరణించారు అనే వార్త కంగారు పెడుతోంది. తాజాగా తమిళ యాక్టర్ రోబో శంకర్ మరణం తమిళ సినిమా పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. రోబో శంకర్ మరణం దక్షిణాది సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. 46 ఏళ్ళ వయసులో మరణించిన ఆయన, కమల్ హాసన్, ధనుష్, విజయ్, కార్తీ, సిమ్రాన్ స్టార్ ల సినిమాల్లో నటించాడు.

Also Read : బెంగళూరు వద్దు.. వైజాగ్ ముద్దు..!

అసలు అతని మరణానికి కారణం ఏంటీ అనే దానిపై తమిళ మీడియా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కొన్నేళ్ళ క్రితం కామెర్ల వ్యాధి నుండి కోలుకున్న శంకర్.. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కామెర్లు వల్ల కలిగే సమస్యలే ఆయన మరణానికి దారితీసి ఉండవచ్చని తమిళ మీడియా వెల్లడించింది. దీనితో ఆయన గుండెపోటుతో సినిమా సెట్‌ లో కుప్పకూలిపోయారని అక్కడి మీడియా తన అభిప్రాయాలను ప్రచురించింది. రోబో శంకర్ కు జీర్ణశయాంతర రక్తస్రావం తీవ్ర సమస్యగా మారిందని వెల్లడించింది.

Also Read : జగన్‌కు షాక్.. టీడీపీలోకి ముఖ్య నేత..!

ఈ ప్రభావం గుండెపై కూడా తీవ్రంగా పడినట్టు వెల్లడించింది. పలు అవయవాలు పని చేయకపోవడంతో ఆయన మరణించారు అని అక్కడి మీడియా వెల్లడించింది. ఆసుపత్రిలోని వైద్య బృందం అతన్ని క్రిటికల్ కేర్ యూనిట్ లో ఆయనకు చికిత్స అందించినా ఉపయోగం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చేరే ముందు ఆయనకు సీపీఆర్ కూడా చేసారని, అయినా.. అంతర్గత అవయవాలు ఫెయిల్ కావడంతోనే ఆయన మరణించారని తమిళ మీడియా పేర్కొంది. కామెర్ల నుంచి కోలుకున్న తర్వాత ఆయన ఆహరం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నా, సమస్యలు ఆయనను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయని మీడియా వెల్లడించింది. కాగా రోబో శంకర్ అసలు పేరు శంకర్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

పోల్స్