Tuesday, October 21, 2025 07:13 PM
Tuesday, October 21, 2025 07:13 PM
roots

జగన్‌కు షాక్.. టీడీపీలోకి ముఖ్య నేత..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. తొలి నుంచి తనకు అండగా నిలిచిన ముఖ్య నేత ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా గుర్తింపు పొందిన మర్రి రాజశేఖర్.. వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్ వెంటే ఉన్నారు. అయితే అనుహ్యంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో మర్రి రాజశేఖర్ విసిగిపోయారు. దీంతో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు మర్రి రాజశేఖర్.

Also read : అప్పుడు చెంప దెబ్బ.. ఇప్పుడు స్వామి సేవ..!

చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్ కేవలం 212 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి నుంచి వైఎస్ వెంటే ఉన్నారు. 2012లో వైసీపీ ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

అయితే అనూహ్యంగా విడదల రజనీని తెరపైకి తీసుకువచ్చిన వైఎస్ జగన్.. మర్రి రాజశేఖర్‌ను పూర్తిగా పక్కన పెట్టారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిని చేస్తామని హామీ ఇచ్చిన జగన్.. 2023 వరకు ఆ హమీ నెరవేర్చలేదు. సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు మర్రికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇక 2024 ఎన్నికల్లో మర్రి రాజశేఖర్, విడదల రజనీని కాదని.. మనోహర్ నాయుడుకు టికెట్ ఇచ్చారు. దీంతో చిలకలూరిపేటలో వైసీపీ ఘోరంగా ఓడిపోయంది.

Also read :నాన్ స్టిక్ పాన్ పొగ పీలుస్తున్నారా..? అయితే జాగ్రత్త..!

మనోహర్ నాయుడును పక్కన పెట్టిన జగన్.. చిలకలూరిపేట ఇంఛార్జ్ బాధ్యతలను తిరిగి విడదల రజనీకి అప్పగించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మర్రి రాజశేఖర్.. వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ ఏడాది మే నెలలోనే మండలి చైర్మన్ కోయ్యే మోషేను రాజుకు రాజీనామా లేఖ పంపారు. వాస్తవానికి ఎమ్మెల్సీగా 2029 వరకు రాజశేఖర్‌కు పదవీ కాలం ఉంది. మర్రి రాజశేఖర్‌తో ప్రత్యేకంగా సమావేశమైన బొత్స సత్యనారాయణ.. రాజీనామా ఉపసంహరించుకోవాలని కూడా సూచించారు. కానీ జగన్ తీరు వల్లే తాను రాజీనామా చేసినట్లు తెలిపారు. 4 నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న మర్రి రాజశేఖర్.. టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సమక్షంలో తన అనుచరులతో కలిసి టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మర్రికి టీడీపీలో కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్