Tuesday, October 21, 2025 07:32 PM
Tuesday, October 21, 2025 07:32 PM
roots

నాన్ స్టిక్ పాన్ పొగ పీలుస్తున్నారా..? అయితే జాగ్రత్త..!

ఈ రోజుల్లో నాన్ స్టిక్ పాన్ లు అనేవి ప్రతీ ఇంట్లో సాధారణ వస్తువులుగా మారిపోయాయి. వీటి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నా సరే ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. వీటి గురించి పరిశోధకులు తాజాగా కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాన్ స్టిక్ వంట సామాగ్రి ఇండియన్ కిచెన్ లో ప్రధానమైన వస్తువుగా మారడంపై ఆందోళన వ్యక్తం చేసారు. తక్కువ నూనె, వంటలో వేగం కారణంగా వీటిని వాడుతున్నారు. వీటిని శుభ్రం చేయడం కూడా ఈజీగా ఉంటుంది.

Also Read : ఏపిలో గూగుల్ డేటా సెంటర్ ముహుర్తం ఫిక్స్..!

దానికి తోడు చౌకగా కూడా మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. కానీ నాన్ స్టిక్ పాన్స్ వాడితే క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అనే మాట వినపడింది. మరి నిజంగా అవి నిజంగా హానికరమా, లేదా మనం వాటిని దుర్వినియోగం చేస్తున్నామా అనేది చూస్తే.. నాన్-స్టిక్ వంట సామాగ్రి పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్ తో పూత పూయబడి ఉంటాయి. ఇదే వంటలో అత్యంత కీలక పాత్ర పోషించి, ఆహారం అంటుకోకుండా చూస్తుంది. ఇక వీటి తయారీలో పెర్ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్ అనే రసాయనం కూడా వాడతారు. ఇదే అనారోగ్య సమస్యలకు కారణం. హార్మోన్ల సమస్యలకు, కాలేయ సమస్యలకు ఇది ప్రధాన కారణంగా చెప్తున్నారు.

Also Read : ఓటు చోరీపై రాహుల్ ఆరోపణల హైలెట్స్ ఇవే

2017లో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ పొల్యూషన్ రీసెర్చ్ ఇంటర్నేషనల్‌ లో ప్రచురించిన కథనంలో ఈ విషయాలను స్పష్టంగా ప్రచురించారు. టెఫ్లాన్-కోటెడ్ పాన్‌ లను ఖాళీగా మంటపై ఉంచడం ప్రమాదకరం అని తేల్చారు. ముఖ్యంగా మంటపై ఖాళీగా ఉంచినప్పుడు, వేడెక్కడం వల్ల విషపూరిత పొగలు విడుదల అవుతాయి. ఈ పొగలు ఫ్లూ లాంటి లక్షణాలను కలిగిస్తాయి. ఈ పొగ కారణంగా పాలిమర్ ఫ్యూమ్ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మందికి ప్రాణాంతకం కాకపోయినా, అవి ఊపిరితిత్తులకు సమస్యలు తెచ్చి పెడతాయి. వెంటిలేషన్ లేని వంటశాలలలో ఇది ప్రమాదానికి కారణం. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, చిమ్నీల వాడే వారికి ఇది సమస్య కాదు. అలాగే రంగు పోయిన పాన్ లను వాడటం మంచిది కాదు. తక్కువ మంట మీద వాడటం కూడా ఉత్తమం. ఆయిల్ ఉపయోగించని వంటలను ఈ పాన్ పై చేయడం మంచిది కాదు. వాటిని శుభ్రం చేసే సమయంలో కూడా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్