Monday, September 15, 2025 08:31 PM
Monday, September 15, 2025 08:31 PM
roots

పొగాకు తాగుతున్నారా..? అయితే డేంజర్ న్యూస్ మీకోసమే..!

ప్రపంచం అనేక దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. షుగర్, క్యాన్సర్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రాణాలను హరించేస్తున్నాయి. ఇక మన దేశంలో టైప్ 2 డయాబెటిస్ తీవ్రంగా ఉంది. టైప్-2 డయాబెటిస్ ఇప్పటికే భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సవాళ్లలో ఒకటి. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అంచనాల ప్రకారం, భారతదేశంలో పది కోట్ల మందికి పైగా ఈ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సంఖ్య పెరుగుతుందని అంచనా.

Also Read : వైసీపీ నేతలకు ఆ మాత్రం తీరక లేదా..!

జన్యుపరమైన సమస్యలు, ఆహార విధానాలు, ఊబకాయం, జీవనశైలి కారణంగా చాలా మంది చిన్న వయసులోనే ఈ సమస్య బారిన పడుతున్నారు. తాజా పరిశోధన ప్రకారం.. సిగరెట్లు, బీడీలు, పొగాకు ఉత్పత్తుల రూపంలో ఈ ప్రమాదం భారీగా పొంచి ఉంది. క్యాన్సర్, గుండె జబ్బులకు మించి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నెలలో యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ కు సమర్పించిన ఒక నివేదిక ప్రకారం పొగాకు వాడితే మధుమేహ సమస్యలు అతి త్వరగా బయటపడతాయని తేల్చారు.

Also Read : తిరుమలలో అపచారమా.. వాస్తవం ఏమిటి..?

కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ (స్వీడన్) పరిశోధకులు, నార్వే, ఫిన్లాండ్‌లోని పరిశోధకులు ఈ పరిశోధన జరిపారు. 17 సంవత్సరాల వయసు ఉన్న వారిని కూడా ఈ పరిశోధనకు తీసుకున్నారు. పొగాకు తీసుకోవడం కారణంగా శరీర కణజాలాలు ఇన్సులిన్‌కు సరిగా స్పందించవని గుర్తించారు. కొన్ని సందర్భాల్లో ఇన్సులిన్ ఉన్నప్పటికీ గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావం ఇన్సులిన్ మీద ఎక్కువ పడుతుందని తేల్చారు. ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్న వారిపై పొగాకు ప్రభావం తీవ్రంగా పడుతుందని వెల్లడించారు. ఇక ఊబకాయం ఉన్న వారు, చిన్న వయసులోనే పొగాకు తాగితే డయాబెటిస్ బారిన పడతారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఐటీ రిటర్న్ కు...

ఆదాయపు పన్ను దాఖలు విషయంలో సంబంధిత...

యూరియా వాడితే క్యాన్సర్.....

ఏపీ సచివాలయం 5వ బ్లాక్ లో...

సజ్జలను లైట్ తీసుకోండి.....

గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ...

భోగాపురంలో ఫస్ట్ విమానం...

ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి...

వైసీపీ నేతలకు ఆ...

ఏపీలో మెడికల్ కాలేజీల రగడ తారాస్థాయికి...

సజ్జల ప్రకటనతో వైసీపీలో...

వైసీపీ అధికారంలోకి వస్తే.. అమరావతి రాజధాని...

పోల్స్