గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. సజ్జల రామకృష్ణా రెడ్డికి జగన్ అతి ప్రాధాన్యత ఇవ్వడం.. అనేది వైసీపీ కార్యకర్తల మనోగతం. చాలా మంది ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇప్పటికీ జగన్ పై విమర్శలు చేస్తూనే ఉంటారు. విజయసాయి రెడ్డి దూరం కావడంలో కూడా ఆయన పాత్రే కీలకం. ఇక జగన్ కంటే సిఎం క్యాంప్ ఆఫీస్ లో సజ్జలే ఎక్కువగా డామినేట్ చేస్తున్నారని పార్టీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
Also Read : వైసీపీ నేతలకు ఆ మాత్రం తీరక లేదా..!
ఇక ఇప్పుడు అధికారం కోల్పోయారు.. ఈ టైం లో కూడా సజ్జల డామినేషన్ నడుస్తోంది. తాజాగా అమరావతిలో ఓ సమావేశం ఏర్పాటు చేయించి.. అందులో అమరావతి గురించి సజ్జల క్లారిటీ ఇచ్చారు. ఇది ఒకరకంగా వైసీపీని ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా చులకన చేసింది. జగన్ నిర్ణయం తప్పు అన్నట్టుగా కార్యకర్తలు కూడా తిట్టడం మొదలుపెట్టారు. పార్టీ నాయకులు సైతం ఈ విషయంలో అసహనం వ్యక్తం చేసారు. మాట తప్పం, మడమ తిప్పం అన్న వాళ్ళు.. మళ్ళీ ఒకటే రాజధాని అనడం ఏంటీ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
Also Read : టార్గెట్ పంచాయితీ.. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు..!
ఇక ఇది అటు తిరిగి ఇటు తిరిగి జగన్ వరకు వెళ్ళింది.. దీనిపై జగన్ సీరియస్ అయినట్టు వైసీపీ వర్గాలు అంటున్నాయి. జగన్ నుంచి పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సజ్జల మాటల గురించి సాక్షిలో హడావుడి వద్దని, ఆ మాటలను నాయకులు ఎవరూ ప్రజల్లోకి తీసుకు వెళ్ళవద్దని జగన్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక సోషల్ మీడియాలో కూడా దాని గురించి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నాయకులు ఎవరూ పోస్ట్ లు చేయవద్దని కూడా చెప్పినట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆ మాటలను పట్టుకుని మీడియా సమావేశాల్లో కూడా మాట్లాడవద్దని ఆదేశించినట్టు తెలుస్తోంది. సజ్జల ఆదేశాలు గాని, వ్యాఖ్యలు గాని పట్టించుకోవద్దని కూడా జగన్ చెప్పినట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.