Monday, September 15, 2025 04:28 PM
Monday, September 15, 2025 04:28 PM
roots

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం లక్షలాది మంది ఏడుకొండల వాడి దర్శనానికి తిరుమల చేరుకుంటారు. ప్రతిరోజు సుమారు 70 వేల మంది స్వామి వారిని దర్శించుకుంటారు. పండుగ రోజుల్లో ఈ సంఖ్య లక్ష చేరుతుంది కూడా. ఇక నిత్యం స్వామి వారి దర్శనానికి వీఐపీలు పెద్ద ఎత్తున వస్తుంటారు. అలాగే బ్రేక్ దర్శనం కోసం వీఐపీల సిఫార్సు లేఖలు కూడా వస్తుంటాయి. ప్రతి రోజు ఉదయం 7 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం కూడా ఉంటుంది.

Also Read : చంద్రబాబు అలా ఎందుకన్నారు..?

ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వకు తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 23వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే టీటీడీ అధికారులు ప్రకటించారు. ఏలాంటి సిఫార్సు లేఖలు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో సర్వ దర్శనం, ఎస్ఎస్‌డీ దర్శనాలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు.

సాలకట్ల బ్రహ్మత్సవాల నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అష్టదళ పాదపద్మారాధన, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెల 15న వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలు స్వీకరించబడవని ప్రకటించారు. తమిళంలో, కోయిల్ అంటే ‘పవిత్ర పుణ్యక్షేత్రం’, ఆళ్వార్ అంటే “భక్తుడు”, తిరు అంటే “శ్రేష్ఠo”, మంజనం అంటే “స్నానం”. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి, ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం అని అర్థం.

Also Read : సజ్జల ప్రకటనతో వైసీపీలో గందరగోళం..!

ఈ శుద్ధి జరుగుతున్న సమయంలో శ్రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. అన్ని దేవతా మూర్తులను, ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన “పరిమళం” అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు.

ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు ఒక మహా యజ్ఞంలా జరుగుతుంది. తర్వాత మూలమూర్తిపై ఉన్న వస్త్రాన్ని తొలగించి, లోపల ఇతర పరివార దేవతలు, దీపం, పూజ వస్తువులను లోనికి తీసుకెళ్తారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది. సంవత్సరానికి నాలుగు సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఐటీ రిటర్న్ కు...

ఆదాయపు పన్ను దాఖలు విషయంలో సంబంధిత...

యూరియా వాడితే క్యాన్సర్.....

ఏపీ సచివాలయం 5వ బ్లాక్ లో...

సజ్జలను లైట్ తీసుకోండి.....

గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ...

భోగాపురంలో ఫస్ట్ విమానం...

ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి...

వైసీపీ నేతలకు ఆ...

ఏపీలో మెడికల్ కాలేజీల రగడ తారాస్థాయికి...

సజ్జల ప్రకటనతో వైసీపీలో...

వైసీపీ అధికారంలోకి వస్తే.. అమరావతి రాజధాని...

పోల్స్