Saturday, September 13, 2025 07:00 PM
Saturday, September 13, 2025 07:00 PM
roots

రేవంత్, కేటీఆర్ కు ఉన్న ధైర్యం జగన్‌కు లేదా..?

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్ష నాయకులు పడే కష్టాలు చూస్తూనే ఉంటాం. వీటిలో ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలలో వేదికగా చేసుకునేందుకు ప్రతిపక్షాల నాయకులు దానా కష్టాలు పడతారు. కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇది చాలా భిన్నంగా ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ఇప్పటివరకు జగన్ ఒకసారి కూడా హాజరు కాలేదు. ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తూ అసెంబ్లీ సమావేశాలను తప్పించుకుంటున్నారు జగన్.

Also Read : తిరుమలలో అపచారమా.. వాస్తవం ఏమిటి..?

తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరుకానని స్పష్టం చేశారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అందుకే తన అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదంటూ జగన్ డిమాండ్ చేయడం ఆశ్చర్యపరిచింది. అయితే ఇక్కడ పరిశీలకులు ఆసక్తికర అంశాలను లేవనెత్తుతున్నారు. గతంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎదుర్కొన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు. 2014 నుంచి 2023 ఎన్నికల వరకు రేవంత్ రెడ్డిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టింది.

పలుమార్లు ఆయనను అరెస్టు కూడా చేశారు. ఉగ్రవాదులు ఉండే జైల్లో ఆయనను బంధించారు. అయినా సరే రేవంత్ రెడ్డి వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. 2018 ముందు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు రేవంత్ రెడ్డి. 2018 ఎన్నికల్లో ఓడిపోవడంతో.. పార్లమెంటుకు పోటీ చేసి గెలిచారు. ఎంపీగా ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులనుంచి ఏమాత్రం సహకారం లేకపోయినా సరే ఒంటరి పోరాటం చేశారు.

Also Read : కేటీఆర్ కు రేవంత్ బిగ్ షాక్.. ఆ కేసు కూడా సీబీఐ చేతికి..?

కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పార్టీ నాయకులనుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి జగన్ కు అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ జగన్ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రయత్నం చేయడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో కేటీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే జగన్ మాత్రం అసెంబ్లీకి దూరంగా ఉంటూ.. కనీస పోరాటం చేయడం లేదనేది చాలామంది మాట. అటు వైసీపీ కార్యకర్తలు కూడా ఈ విషయంలో జగన్ పై విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

పోల్స్