భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి ఆ పార్టీ పెద్దలకు చుక్కలు చూపిస్తోంది. రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసిన మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి దెబ్బకు ఏం చేయాలో అర్థం కాక మల్ల గుల్లాలు పడుతున్నారు. రాజకీయంగా రేవంత్ రెడ్డి ప్రస్తుతం బలంగా ఉన్నారు. ప్రభుత్వంలో కూడా ఆయనకు పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. అందుకే నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి స్వేచ్ఛగా తీసుకుంటున్నారు. ఈ విషయం ఇటీవల కాలేశ్వరం కమిషన్ నివేదిక తర్వాత స్పష్టత వచ్చింది.
Also Read : వారసులు.. ఎవరు అసలు.. ఎవరు నకిలీ..?
ఆ కేసును సిబిఐ కి అప్పగించడంతో భారత రాష్ట్ర సమితి ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్పుడు మరో కేసు సిబిఐకి అప్పగించే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ కేసును ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపించారు. ఇక త్వరలోనే గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ వ్యవహారంలో కొన్ని తేలవలసిన అంశాలు ఉన్నాయి అనేది రేవంత్ రెడ్డి అభిప్రాయం.
Also Read : తిరుమలలో అపచారమా.. వాస్తవం ఏమిటి..?
దీనితో ఈ కేసును కూడా సిబిఐ కి అప్పగించే అవకాశం ఉండవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఈ కేసును సిబిఐ కి అప్పగించే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేంద్రంతో రేవంత్ ముందు నుంచి సన్నిహితంగానే ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో కంటే బీజేపీ నాయకులతోనే ఎక్కువగా స్నేహం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు భారత రాష్ట్ర సమితిని ఇబ్బంది పెడుతోంది. ఈ కేసులో దాదాపు 45 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీనితో కేసును సిబిఐకి అప్పగిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల సిబిఐ కి సాధారణ సమ్మతిని అనుమతించిన సంగతి తెలిసిందే.