Friday, September 12, 2025 10:10 PM
Friday, September 12, 2025 10:10 PM
roots

ఎన్టీఆర్ వారసులపై అనుచిత వ్యాఖ్యలు..!

N T R.. ఈ మూడు అక్షరాలు చాలు.. తెలుగువాడి ఆత్మగౌరవం అంటే చెప్పటానికి. N T R.. ఈ మూడు అక్షరాలు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పాయి. N T R.. ఈ మూడు అక్షరాలు ఢిల్లీ గద్దెను శాసిస్తున్న జాతీయ పార్టీలను సైతం గజ గజ వణికించాయి. నందమూరి తారక రామారావు.. అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో కూడా ఎదురు లేని రారాజు, మచ్చలేని రాజకీయ నేత. పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి. ఎన్నో సంస్కరణలకు ఎన్టీఆర్ ఒక మైలు రాయి.

Also Read : వారసులు.. ఎవరు అసలు.. ఎవరు నకిలీ..?

రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్‌కు అభిమానులున్నారు. ఎన్టీఆర్ అన్ని పార్టీల నేతలు గౌరవిస్తారు. అలాంటి ఎన్టీఆర్‌పై ఇప్పుడు ఓ వర్గం పనిగట్టుకుని పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తోంది. సరిగ్గా నెల రోజుల క్రితమే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను రచ్చ రచ్చ చేశారు. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను అడ్డుకున్నారు. దీని వల్ల ఎన్టీఆర్‌తో పాటు శ్రీకృష్ణుడిని కూడా ఒక కులానికే పరిమితం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.

Also Read : మళ్ళీ మోడినే పీఎం.. చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

తాజాగా వైసీపీ అనుకూల మీడియా ఎన్టీఆర్ వారసులపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. తెలుగుదేేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు గురించి వైసీపీ అనుకూల మీడియా గ్రేట్ ఆంధ్ర అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్‌కు చాలా మంది కొడుకులు, కుమార్తెలున్నా.. ఏం లాభం.. తండ్రి రాజకీయ వారసత్వాన్ని దక్కించుకోవడం చేతకాని అసమర్థులు అంటూ వ్యాఖ్యలు చేసింది గ్రేట్ ఆంధ్ర. ఎన్టీఆర్ వారసులు చేతకాని అసమర్థులు అంటూ నోరు పారేసుకుంది. ఎన్టీఆర్ నటనా వారసునిగా నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అలాగే ఎన్టీఆర్ తర్వాత వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ గెలిచారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ కూడా మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. రాజకీయాల్లో రాణించారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవటంలో హరికృష్ణ కీలక పాత్ర పోషించారు. అలాగే హరికృష్ణ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇక ఎన్టీఆర్ సినీ వారసత్వాన్ని ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు తారక రత్న కూడా కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ వారసుల్లో ఒకరు సినిమాటోగ్రాఫర్‌ ఉన్నారు. ఇక నలుగురు కుమార్తెల్లో ఒకరు దగ్గుబాటి పురందేశ్వరి. ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వహించారు. అయినా సరే.. ఎన్టీఆర్ వారసులు చేతకాని అసమర్థులు అని గ్రేట్ ఆంధ్ర వ్యాఖ్యానించడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గ్రేట్ ఆంధ్ర యాజమాన్యం తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్