వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు, కేంద్ర రాజకీయాలపై ఆయన మాట్లాడారు. పెట్టుబడులు తదితర అంశాలపై ఆయన ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. విజన్ రూపకల్పన చేయడమే కాదు… దాన్ని సాధ్యం చేసే దిశగా పని చేయాలన్నారు సీఎం. జాతీయ స్థాయిలో వికసిత్ భారత్-2047, రాష్ట్రస్థాయిలో స్వర్ణాంధ్ర-2047 విజన్ సిద్ధం చేశామని తెలిపారు. 20-25 ఏళ్ల క్రితం భారతీయులకు సరైన గుర్తింపు లేని సమయంలో తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి భారత దేశం అభివృద్ధి అన్ స్టాపబుల్‌గా మారిందన్నారు.
Also Read : లోకేష్ అదుర్స్.. వార్ రూమ్ లోనే మంత్రులు
2038 నాటికి భారత దేశం నెంబర్-1 అవుతుంది… ఇందులో తెలుగు వారి పాత్ర ప్రధానంగా ఉండాలని భావిస్తున్నాని ఆశాభావం వ్యక్తంచేశారు. ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రణాళికలు రూపొందిచుకున్నాం… ఈ ఏడాది.. గతేడాది డబుల్ డిజిట్ గ్రోత్ సాధించగలిగామన్నారు. 2028-29 నాటికి రూ. 29, 29,402 కోట్ల మేర జీఎస్డీపీ సాధిస్తామని తెలిపారు. 2029-2034 నాటికి రూ.57,21,610 కోట్ల జీఎస్డీపీ సాధించేలా ప్రణాళికలు రూపొందించామని, దీన్ని సాధించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందన్నారు. 2028-29 నాటికి తలసరి ఆదాయాన్ని రూ. 5,42,985 సాధిస్తామని తెలిపారు. 2029-2034 నాటికి తలసరి ఆదాయం రూ. 10,55,000 సాధించగలమని ధీమా వ్యక్తంచేశారు. ఇదేమీ అసాధ్యం కాదు… నిర్థిష్టమైన ఆలోచనతోనే ప్రణాళికలు వేశామన్నారు.
Also Read : మళ్ళీ బ్యాట్ పట్టిన రోహిత్.. టార్గెట్ ఫిక్స్..?
మెగా డ్రీమ్స్ ఉండాలి… సంకల్పం ఉండాలి… అప్పుడు సాధ్యమేనన్నారు. విజన్ 2020 డాక్యుమెంట్ సాకారమయ్యాక కూడా విజన్‌పై ఇంకా అనుమానాలు సరికాదని స్పష్టం చేశారు. భారత్ లాంటి దేశాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండింటిని సమాతరంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం చేస్తున్నాం… అభివృద్ధికి అదే తరహాలో నిధులిస్తున్నామని తెలిపారు. 1994లో చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను… 1999లో గెలిచానని పేర్కొన్నారు. 1999లో ప్రభుత్వం వచ్చాక ఓ తపనతో పని చేశాను.. కొంచెం బ్యాలెన్స్ చేయలేకపోయామన్నారు. కానీ ఇప్పుడు పూర్తి బ్యాలెన్స్ చేస్తున్నాం… సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. నాలుగోసారి కూడా మోదీనే వస్తారు… రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుంది.. ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు.