ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమైందా..? అంటే అవుననే అంటున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే స్థానిక సంస్థలను ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్ లకు లేఖలు రాసారు. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. జనవరిలో ఈ ఎన్నికల నిర్వహణ ఉండనుంది.
Also Read : అసలు విషయం మర్చిపోయారా సార్..!
వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ముగియనుంది. మార్చిలో.. నగరపాలక (కార్పొరేషన్లు), పురపాలక (మున్సిపాలిటీలు), నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం ముగుస్తుంది. అయితే పదవీ కాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహిస్తారు. ముందే ఎన్నికలు నిర్వహించేందుకు రూపొందించిన చట్టం మున్సిపల్ కార్పొరేషన్ చట్టం-1955 ప్రకారం సాధారణ స్థానికసంస్థల ఎన్నికలు సభ్యుల పదవీకాలం పూర్తయ్యే మూడు నెలల్లోపు నిర్వహించాలి.
Also Read : అసలు వస్తారా.. రారా.. ఏమైంది మీకు..?
అందుకే జనవరిలోనే ఈ ఎన్నికలను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను 2025 అక్టోబరు 15లోగా పూర్తి చేయాలని ఎన్నికల కమీషనర్ తన లేఖలో స్పష్టం చేసారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను అక్టోబరు 16 నుంచి నవంబరు 15లోగా సిద్ధం చేసి, ప్రచురించాలని సూచించారు. ఎన్నికల అధికారుల నియామకాన్ని నవంబరు 1 నుంచి 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి నవంబరు 16 నుంచి 30లోగా పూర్తి చేసి, రిజర్వేషన్లు డిసెంబరు 15లోపు ఖరారు చేయాలి.
Also Read : రష్యా భారీ డిస్కౌంట్.. అమెరికాకు భారత్ షాక్..!
రాజకీయ పార్టీలతో డిసెంబరు చివరి వారంలో సమావేశాలు నిర్వహించి వారి సలహాలను లేదా అభ్యంతరాలాను స్వీకరించాల్సి ఉంటుంది. 2026 జనవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్, అదే నెలలో ఫలితాలు ప్రకటించే విధంగా ఎన్నికల కమీషన్ ప్రణాళిక సిద్దం చేస్తోంది. గ్రామ పంచాయతీలకు 2026 జనవరి నుంచి ఎన్నికల నిర్వహణ, జులై నుంచి ఎంపీటీసీ/జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తారు.