ప్రజా ప్రతినిధులు అంటే.. ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్లు అని అర్థం. ఎందరో మహానుభావులు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేశారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనా, కాకపోయినా కూడా ప్రజా సమస్యలపై గట్టిగానే ప్రస్తావించారు. ప్రభుత్వాలపై ప్రత్యక్ యుద్ధమే చేశారు. అయితే ఇద్దరు మాజీలు మాత్రం.. ఎన్నికల రణక్షేత్రంలో ఓడిన తర్వాత చట్టసభకు రాకుండా ముఖం చాటేస్తున్నారు. వాళ్లే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
Also Read : కవితకు బండి సంజయ్ గాలం..?
కేసీఆర్ 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. వరుసగా రెండుసార్లు గెలిచిన కేసీఆర్.. పార్టీ పగ్గాలను మాత్రం కుమారుడు కేటీఆర్ చేతుల్లో పెట్టారు. కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత కేసీఆర్ సైలెంట్ అయ్యారనే మాట వినిపిస్తోంది. ఇక ఎన్నికల్లో ఓడిన తర్వాత కేసీఆర్ బయటకు రావడమే మానేశారు. అసెంబ్లీ సమాశాలకు కూడా రావడం లేదు. సభకు వస్తే.. 9 ఏళ్ల కాలంలో జరిగిన అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుందేమో అని భయపడుతున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయినా సరే.. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌజ్ దాటి బయటకు రాలేదు. చివరికి కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నా కూడా కేసీఆర్ నొరెత్తలేదు. కనీసం కూతురు, కొడుకు మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం కూడా చేయలేదు. చివరికి కవితను సస్పెండ్ చేయడంతో పార్టీ రెండు ముక్కలైనట్లు అయ్యింది. అయినా సరే.. కేసీఆర్ మాత్రం బయటకు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కూడా కేసీఆర్ కనిపించలేదు. కనీసం వివరణ ఇవ్వలేదు.
Also Read : హరీష్ పై బాంబులు పేల్చిన కవిత.. మా అన్నను ఓడించడానికి కుట్ర చేసాడు..!
2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వ్యవహరించారు. ఆయన కూడా మరోసారి గెలుపు ఖాయమనుకున్నారు. కానీ ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నుంచి అసెంబ్లీకి రావడం లేదు. ఏడాది కాలంలో జరిగిన సమావేశాల్లో కేవలం ఒక్క రోజు మాత్రమే వచ్చారు. అది కూడా సరిగ్గా 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను సభలోనే ప్రస్తావించాలి. సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలి. కానీ జగన్ మాత్రం బెంగళూరు యలహంక ప్యాలెస్ దాటి రావటం లేదు. చివరికి సొంత పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తుంటే.. తప్పుడు కేసులు అని బయట మాట్లాడుతున్నారు తప్ప… సభకు వచ్చిన నిజా నిజాలు మాత్రం చెప్పటం లేదు. దీంతో అసలు ఇలాంటి నేతలకు జీతాలు ఎందుకు.. ప్రభుత్వ నిధులు ఎందుకు ఖర్చు చేయాలనే మాట వినిపిస్తోంది. అసలు సభకు వస్తారా.. రారా.. అని కూడా నిలదీస్తున్నారు.