Monday, October 27, 2025 08:00 PM
Monday, October 27, 2025 08:00 PM
roots

బెజవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా దేవినేని వారసుడు..?

తెలుగుదేశం పార్టీకి దేవినేని కుటుంబానికి విడదీయురాని అనుబంధం ఉంది. దేవినేని నెహ్రూ, దేవినేని రమణ, దేవినేని ఉమా ముగ్గురు తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా పని చేశారు. ఇక దేవినేని అవినాష్ రెండవ తరం నాయకుడిగా.. తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా పనిచేసి 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలోకి వెళ్లారు. ఇక ఆ తర్వాత దేవినేని కుటుంబంలో ఉమా మాత్రమే కీలకంగా ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీటు ఇవ్వలేదు. ప్రస్తుతం ఉమా కీలక పదవి కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Also Read : హరీష్ పై బాంబులు పేల్చిన కవిత.. మా అన్నను ఓడించడానికి కుట్ర చేసాడు..!

ఇక ఈ సమయంలో మరో దేవినేని వారసుడి పేరు టిడిపి వర్గాల్లో బలంగా వినపడుతోంది. విజయవాడకు చెందిన దేవినేని చంద్రశేఖర్.. తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి యాక్టివ్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో నూజివీడు నుంచి పోటీ చేయాలని భావించిన చందు ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఏదైనా సీటు ఇస్తే పోటీ చేద్దామని ఎదురు చూశారు. కానీ చందుకు అవకాశం దక్కలేదు. అయితే ఆయన తల్లి దేవినేని అపర్ణ ప్రస్తుతం కార్పొరేటర్ గా ఉన్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్న అపర్ణ.. ప్రోత్సహిస్తూ వచ్చారు.

Also Read : మీ డెసిషన్ ఫైనల్.. మంత్రి పదవిపై చంద్రబాబుకు పవన్ క్లారిటీ

అటు మంత్రి నారా లోకేష్ తో కూడా దేవినేని చంద్రశేఖర్ సన్నిహితంగానే ఉంటారు. ఈ క్రమంలో ఇటీవల లోకేష్ నుంచి చందుకు ఓ హామీ వచ్చినట్లు సమాచారం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ మేయర్ గా అవకాశం ఇస్తామని.. లోకేష్ హామీ ఇచ్చారట. ఈ మేరకు నగరంలో పార్టీ బలోపేతానికి కష్టపడాలని చందు కు సూచించినట్లు విజయవాడలో చర్చ జరుగుతుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసినేని నాని కుమార్తె తెలుగుదేశం పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో స్థానిక నాయకుల నుంచి కూడా సహకారం లేకపోవడంతో ఆమె ఓటమిపాలయ్యారు. ఇక ఇప్పుడు పార్టీ అధిష్టానం నుంచి ఎమ్మెల్యేలకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో విజయవాడ మేయర్ గా దేవినేని చందు ఎన్నిక కావడం లాంచనమే అంటున్నాయి టిడిపి వర్గాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్