సాధారణంగా రాజకీయ నాయకులు ఎక్కువగా ప్రజల్లో ఉండటానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నాలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. అలా చేస్తేనే రాజకీయాల్లో వారికి ఓ గుర్తింపు ఉంటుంది. నిత్యం మీడియాలో కనపడటమో లేదంటే ఏదైనా కార్యక్రమం నిర్వహించడం వంటివి చేస్తూ ఉండాలి. అయితే ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ మాత్రం ఎక్కడుంటున్నారో కూడా తెలియక ఆ పార్టీ కార్యకర్తలు అయోమయంలో ఉండిపోయారు. జగన్ అధికారం కోల్పోయిన తర్వాత 40 సార్లు బెంగళూరు వెళ్లారు.
Also Read : ఒక్కటే రాజధాని.. కానీ.. నారా లోకేష్ ఆసక్తికర కామెంట్
అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ రావడం ఏదో ఒక కార్యక్రమం మీద మీడియా మీడియా సమావేశం పెట్టడం, ఆ తర్వాత కనబడకుండా పోవడం జగన్ నిరంతరం చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు నిరసన కార్యక్రమాలు గాని, విమర్శలు గాని జగన్ చేయకపోవడం, కనీసం మీడియాలో కనపడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లికి పరిమితమైన జగన్ అధికారం కోల్పోయిన తర్వాత బెంగళూరుకు పరిమితమయ్యారు. తనపై టిడిపి నేతలు విమర్శలు చేస్తున్న, కొన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విమర్శలు చేసే అవకాశం ఉన్నా సరే జగన్ మాత్రం దూరంగానే ఉంటున్నారు.
Also Read : ఇండియా టుడే బీహార్ మూడ్ చేంజ్ చేస్తుందా..?
అటు వైసిపి నాయకులు కూడా ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం గానీ, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలో గానీ వైసీపీ కార్యకర్తలు గతంలో మాదిరిగా వ్యవహరించడం లేదు. అసలు జగన్ ఎక్కడుంటున్నారో కూడా కనీసం కార్యకర్తలకు సమాచారం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గానీ పవన్ కళ్యాణ్ గాని అధికారం లేకపోయినా సరే మీడియాలో ఉండేవారు. వారికి సంబంధించి ఏదో ఒక పర్యటన లేదంటే మీడియా సమావేశం ఉండేది. అప్పట్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతిపక్ష నాయకులు వ్యవహరించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం వైసిపి కార్యకర్తలకు సోషల్ మీడియాలో విమర్శలు చేసేందుకు కూడా అధిష్టానం నుంచి సరైన సమాచారం దొరకటం లేదు. వైసీపీ కార్యకర్తల సొంతగా తయారు చేసుకున్న కంటెంట్ మినహా ఆ పార్టీ అధిష్టానం అందిస్తున్న కంటెంట్ లేదనే చెప్పాలి.