Saturday, October 25, 2025 07:57 PM
Saturday, October 25, 2025 07:57 PM
roots

వినాయక ఉత్సవాలకు సర్కార్ గుడ్ న్యూస్..!

ఏపీలో వినాయక చవితి పండుగకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు కమిటీలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే మండపాలను సిద్ధం చేస్తున్నారు. అలాగే భారీ విగ్రహాలను పెట్టేందుకు చందాలు సేకరిస్తున్నారు. 9 రోజుల పాటు గణనాధుని పూజలు నిర్విఘ్నంగా కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారు. మండపాలు, తోరణాలు, పంతులు గారు ఇలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Also Read : అరుణ ఫోన్ లో ఐపిఎస్, మాజీ మంత్రి వీడియోలు..?

మండపం ఏర్పాటు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పని సరి అని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎలాంటి రుసుం లేకుండానే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. నవరాత్రి మహోత్సవాలను భక్తులు భక్తీశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు.

Also Read : శ్రీశైలం మాకే… కాదు మాకు కావాల్సిందే..!

మరో రెండు రోజుల్లో వినాయక చవితి పండుగ. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు, మండపాల నిర్వాహకులకు శుభవార్త అంటూ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వినాయక ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తన దృష్టికి తీసుకువచ్చిన వినతిని సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో చర్చించినట్లు లోకేష్ తెలిపారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గా పందిళ్లకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. వినాయక చవితి, దసరా ఉత్సవాల ఉచిత విద్యుత్ కోసం కూటమి ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చించనుంది అని నారా లోకేష్ వెల్లడించారు. లోకేష్ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇక ఉత్సవాలను దుమ్ములేపుతాం అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్