Sunday, October 19, 2025 08:25 PM
Sunday, October 19, 2025 08:25 PM
roots

అన్న చెప్తారంతే.. కానీ చేయరు..!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.. ఆ పార్టీ కార్యకర్తలకు ఓ భరోసా. మాట తప్పడు.. మడమ తిప్పడు.., చెప్పాడంటే.. చేస్తాడంతే.. అంటూ పెద్ద పెద్ద డైలాగులు కూడా చేస్తారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే.. సింహం సింగల్ అంటూ ఎలివేషన్ ఇచ్చారు. ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు గెలిచాడు మా అన్న.. అని ఇప్పటికీ గొప్పగా చెబుతారు. అయితే ప్రస్తుతం జగన్ తీరు చూస్తే మాత్రం.. ఆయన మాటలన్నీ నీటి మూటలే అంటున్నారు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు.

వై నాట్ 175 అని గొప్పగా చెప్పిన జగన్.. ఎన్నికల్లో సింగిల్ అని చెప్పి వెళ్లి.. 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. ఇక ఓటమి తర్వాత ఇప్పటి వరకు అసెంబ్లీకి కేవలం రెండు సార్లు మాత్రమే వచ్చారు. ఒకటి శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు.. రెండోది బడ్జెట్ సమావేశాల తొలి రోజున సభకు వచ్చి సరిగ్గా 11 నిమిషాలే సభలో ఉండి వెళ్లిపోయారు. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా.. అంటూ వింత వితండ వాదనతో అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారు జగన్.

Also Read : తప్పుడు పనులు చేస్తే వదలను.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

2024 ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్ తీరులో చాలా మార్పు వచ్చిందంటున్నారు వైసీపీ నేతలు. ఓటమి తర్వాత సైలెంట్‌గా తాడేపల్లి నుంచి బెంగళూరుకు మకాం మార్చేశారు. ప్రస్తుతం వారానికి ఓ సారి తాడేపల్లి వచ్చి ఒకరిద్దరు నేతలతో కలిసి వెళ్లిపోతున్నారు. ఇక రివ్యూ మీటింగ్‌లలో కూడా నాలుగు పంచ్ డైలాగులు వేసి, టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చి వెళ్లి పోతున్నారు తప్ప.. పార్టీ కార్యకర్తల గురించి జగన్ ఏ మాత్రం పట్టించుకోవటం లేదనేది ఆ పార్టీ నేతల ఆరోపణ.

జగన్ ఇప్పటి వరకు కార్యకర్తలతో నేరుగా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. కార్యకర్తల సమస్యలు తెలుసుకోలేదు. అసలు పార్టీలో కిందిస్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయో కూడా జగన్‌ పట్టించుకోవటం లేదనేది ప్రధాన ఆరోపణ. ఇదే సమయంలో జగన్ చెప్పిన మాటలకు, చేస్తున్న పనులకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ఏడాది సంక్రాంతి నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని.. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు రివ్యూలు చేస్తానని.. ప్రతి నియోజకవర్గం కార్యకర్తలతో నేరుగా సమావేశమవుతాను అనేది జగన్ చెప్పిన మాట. కానీ సంక్రాంతి దాటి దసరా కూడా వస్తుంది. కానీ ఇప్పటి వరకు జగన్ మాత్రం పరామర్శలు, పెళ్లిళ్లకు తప్ప.. బయటకు వచ్చిన సందర్భం లేదు.

Also Read : బిగ్ బాస్ లోకి మెగా ఫ్యామిలీ హీరో ఎంట్రీ

ఇక లోకేష్ రెడ్ బుక్‌కు కౌంటర్‌గా గుడ్ బుక్ మొదలుపెడతా అని.. ఇబ్బంది పడిన నేతలు, కార్యకర్తల పేర్లు అందులో రాస్తా అని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి పదవులు ఇస్తానని అప్పట్లో గొప్పగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఆ గుడ్ బుక్ ఏమైందో తెలియదు. అలాగే కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ఇలా తప్పుడు కేసులు పెట్టిన వారి గురించి ఓ యాప్‌లో ఫిర్యాదు చేస్తే.. అది పార్టీ డిజిటల్ లైబ్రరీకి చేరుతుందని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లైబ్రరీ నుంచి వివరాలు తెప్పిస్తా అంటూ నెల క్రితం ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తా అంటూ వార్నింగ్ కూడా చేశారు. కానీ నెల రోజులు దాటినా కూడా డిజిటల్ లైబ్రరీ ఊసే లేదు. దీంతో జగన్ తీరుపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. అన్న చెప్పారంతే… ఏమీ చేయరు.. అది అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు… ఎప్పుడైనా ఇంతే.. అంటూ సొంత పార్టీ కార్యకర్తలే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్