Wednesday, August 5, 2026 02:27 PM
Wednesday, August 5, 2026 02:27 PM

భారత్ ఆయిల్ కొనడం లేదు.. ట్రంప్ సంచలన కామెంట్స్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరి భారత్ తో పాటుగా పలు దేశాలకు పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏ నిర్ణయం అమెరికా ప్రభుత్వం తీసుకుంటుందో అర్ధం కాక ఎన్నో దేశాలు ఆందోళనలో ఉన్నాయి. గత నెలలో భారత్ పై ట్రంప్ సుంకాల దాడి చేసిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది అనే కారణంతో భారత్ పై 50 శాతం సుంకాలు విధించారు. రష్యాకు భారత్ నిధులు సమకూర్చి ఉక్రెయిన్ పై పోరాటానికి మద్దతు ఇస్తోందని ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

Also Read : కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న జీఎస్టీ..?

ఇక తాజాగా ట్రంప్ మరోసారి సంచలన కామెంట్స్ చేసారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేసిందని ట్రంప్ సంచలన కామెంట్స్ చేసారు. అయితే భారత్ మాత్రం ఈ విషయంలో ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే రష్యాపై ఆంక్షలు విధించడంతోపాటు, ఆ దేశం నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించిన సంగతి తెలిసిందే.

Also Read : ఆ పార్టీ భవిష్యత్తు తేల్చేసిన ఉండవల్లి..!

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే మొదటి రెండు దేశాలు చైనా, భారత్. 40 శాతం ఆయిల్ ను భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తన నిర్ణయాలతో రష్యా విషయంలో భారత్ వెనక్కు తగ్గిందని ట్రంప్ కామెంట్ చేసారు. ఇక తాను భారత్ పై సుంకాలు విధించే అవకాశం లేదన్నారు ట్రంప్. ట్రంప్ చర్యల తర్వాత భారత ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు శుద్ధి కర్మాగారాలు రష్యన్ ముడి చమురు కొనుగోలును నిలిపివేసాయని బ్లూమ్‌ బెర్గ్ వెల్లడించింది. అయితే ఈ విషయంలో కేంద్రం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్