ఏళ్ళ తరబడి సాగుతోన్న రష్యా – ఉక్రెయిన్ యుద్దం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. ఏ విధంగా రష్యాపై ఒత్తిడి పెంచినా సరే రష్యా వెనక్కు తగ్గకపోవడంతో ఉక్రెయిన్ కూడా అదే స్థాయిలో పోరాటం చేస్తూ వస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు. ఈ భేటీ ఏదోక పరిష్కారం చూపిస్తుందని ఆశించినా చివరకు ఏ ఫలితం లేకుండానే ముగిసింది.
Also Read : కూలీ డామినేషన్.. మరీ ఈ రేంజ్ లోనా..?
మూడు గంటల పాటు చాలా మంచి చర్చలు జరిగాయని ఇరుదేశాల అధ్యక్షులు ప్రకటించారు. కానీ.. ఏ ఫలితం లేదన్నారు. ఇదే సమయంలో.. కాల్పుల విరమణ ఒప్పందం జరిగే వరకు మరో ఒప్పందం చేసుకునేది లేదని ట్రంప్ స్పష్టం చేసారు. పుతిన్ మాట్లాడుతూ, యుద్ధం విషయంలో, కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో యూరోపియన్ యూనియన్ చర్యలను తాను నమ్మలేను అని, ఉక్రెయిన్ చేస్తున్న పనులు ఎప్పుడూ అనుమానాస్పదమే అని ఆయన వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నారు.
Also Read : మీరు మారేది ఎప్పుడు.. మార్పు రాదా..?
అమెరికా లేదంటే యూరప్ దేశాలు ఉక్రెయిన్ ను యుద్ధం దిశగా గతంలో రెచ్చగోట్టాయి అని ఇప్పుడు కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అదే పని చేస్తున్నాయని విమర్శించారు పుతిన్. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి పుతిన్.. అమెరికా వెళ్ళారు. ఇక తర్వాతి సమావేశం మాస్కోలో జరగనుందని పుతిన్ వెల్లడించారు. ఈ సమావేశం ఉక్రెయిన్ – రష్యా మధ్య శాంతి చర్చలు నెలకొల్పే అవకాశం ఉందనే ఆశాభావాన్ని పుతిన్ వ్యక్తం చేసారు.