వైసీపీ నేతలను ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా వాళ్లు చేస్తున్న పనులే. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కేవలం వైసీపీ నేతల తీరు మాత్రమే కారణం. దీనికి అప్పట్లో వైసీపీ సోషల్ మీడియా కూడా తన వంతు సాయం అందించింది. వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో ప్రతి పోస్టు కూడా ఫేక్ ప్రచారమే. నాటి ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోస్తూ.. తప్పుడు ప్రచారం చేశారు. ఇంకా చెప్పాలంటే.. బూతులతో రెచ్చిపోయారు. మార్ఫింగ్ ఫోటోలతో వ్యక్తిత్వ హననానికి కూడా తెగబడ్డారు. అయితే ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్ అందుబాటులోకి రావడంతో పాటు.. టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండటం వల్ల వైసీపీ నేతల నిజస్వరూపం బయటపడింది. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేశారు.
Also Read : అప్పుడు నంద్యాల ఇప్పుడు పులివెందుల.. టీడీపీకి సెంటిమెంట్ భయం..?
వై నాట్ 175 అని గొప్పగా చెప్పిన జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇందుకు ప్రధానంగా వైసీపీ నేతల తీరే కారణం. వైసీపీలో ద్వితీయ శ్రేణి నేత మొదలు.. అధినేత వరకు బూతులతో రెచ్చిపోయారు. చివరికి అసెంబ్లీలోనే చంద్రబాబు కుటుంబంపై నీచమైన కామెంట్లు చేశారు ఎమ్మెల్యేలు. అందుకే వైసీపీ నేతలకు ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారు. అందుకే కేవలం 11 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు కూడా ఒప్పుకున్నారు. మేము తప్పు చేశాం.. అందుకే మాకు 11 సీట్లు వచ్చాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వయంగా మీడియా ముందే ఒప్పుకున్నారు. అయినా సరే వైసీపీ నేతల తీరులో మాత్రం.. ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఓటమి వైసీపీ నేతలను తీవ్రంగా కలవరపెడుతోంది. దీంతో ఏం చేస్తున్నారో కూడా తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేశారనేది తొలి నుంచి వైసీపీ నేతలు చెబుతున్న మాట. ఎన్నికల రోజు నుంచి ఇదే మాట పదే పదే చెబుతున్నారు. కానీ ఇందుకు సంబంధించిన ఏ ఒక్క రుజువు కూడా చూపించలేక పోయారు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోయ ప్రవీణ్ ఐపీఎస్‌కు అంకితం అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇది ఓ వ్యక్తి.. బ్యాలెట్ పేపర్ పైన బలవంతంగా ఓట్లు వేసి.. వాటిని బ్యాలెట్ బాక్సులో వేస్తున్న వీడియో. దీనిని ఏపీలో జరిగినట్లు అంబటి చూపించే ప్రయత్నం చేశారు. అయితే వాస్తవానికి ఈ వీడియో ఏపీలో జరిగింది కాదు.
Also Read : కూలీ డామినేషన్.. మరీ ఈ రేంజ్ లోనా..?
ఈ వీడియో గురించి నెటిజన్లు వాస్తవాలు వెల్లడించారు. ఈ వీడియో పశ్చిమ బెంగాల్‌లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగింది. అదే వీడియోను అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే ఆయన పరువు తీసింది. దీనిపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. చివరికి వైసీపీ నేతలంతా ఇంతేనా అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో మరో మాజీ మంత్రి రోజా కూడా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు.. ఇప్పుడు విమర్శల పాలవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో వైసీపీకి 62 శాతం ఓట్లు వచ్చాయని.. కానీ ప్రస్తుత ఉప ఎన్నికల్లో మాత్రం కేవలం 8.95 శాతం ఓట్లు రావడం ఏమిటో అని ప్రశ్నించారు. ప్రస్తుతం వైఎస్ జగన్‌కు అనుకూల వాతావరణం ఉందని కూడా వ్యాఖ్యానించారు. పులివెందుల మెడికల్ కాలేజీని ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో టీడీపీకి 88 శాతం ఓట్లు రావడం ఏంటో.. అంటూ వ్యాఖ్యానించారు. అధికార దుర్వినియోగం, అవకతవకలతో పులివెందుల తీర్పు ప్రతా తీర్పు ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించారు. రోజా వ్యాఖ్యలకు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఘాటుగా బదులిచ్చారు. “వైసీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుంది ఏమిటో.. పిచ్చి ప్రేలాపనలు పక్కన పెట్టి.. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం.. నగరి నుంచి ఉచితంగా విజయవాడ తాడేపల్లి ప్యాలెస్ వరకు బస్సులో ప్రయాణించి.. మీ అధినేతను ఓదార్చు..” అంటూ గాలి భాను ప్రకాష్ కౌంటర్ పోస్టు పెట్టారు.