Friday, September 12, 2025 02:55 PM
Friday, September 12, 2025 02:55 PM
roots

వన్డే కెప్టెన్ గా అతనే.. రోహిత్ కు షాక్ తప్పదా..?

టీమిండియా ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ను బాధ్యతలనుంచి తప్పించే అవకాశం ఉంది అనే ప్రచారం గత నెల రోజుల నుంచి జరుగుతుంది. రోహిత్ వయసు ప్రస్తుతం 38 ఏళ్ళు. భవిష్యత్తుపై దృష్టి పెడుతున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, సెలక్టర్లు తదుపరి కెప్టెన్ ఎవరు అనేదానిపై కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి 2027 ప్రపంచకప్ వరకు రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో కెప్టెన్ గా కొనసాగుతాడని భావించారు. కానీ బోర్డు పెద్దలు మాత్రం రోహిత్ ను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Also Read : ఏ ఆనకట్ట అయినా కూల్చేస్తాం: భారత్ కు పాక్ వార్నింగ్ 

ఎలాగైనా 2027 ప్రపంచ కప్ గెలవాలని పట్టుదలతో ఉన్న బోర్డు పెద్దలు.. కెప్టెన్ గా.. రిషబ్ పంత్ కు బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టెస్ట్ క్రికెట్లో తన సత్తా ఏంటో చూపించిన రిషబ్.. 50 ఓవర్ల ఫార్మేట్ లో కూడా సత్తా చాటుతాడని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. అందుకే భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని అతనికి సరికొత్త బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగించి.. ఆ తర్వాత పంత్ కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.

Also Read : సచిన్ కు అడ్డురాని వయసు కోహ్లీకి వచ్చిందా..?

ప్రస్తుతం గాయం కారణంగా పంత్ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఆరువారాల విశ్రాంతి తర్వాత తిరిగి జట్టులో చేరనున్నాడు. శుభమన్ గిల్ టెస్ట్ క్రికెట్ తో పాటుగా.. టి20 ఫార్మేట్ కు కూడా కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. వన్డే క్రికెట్ కు మాత్రం మరో కెప్టెన్ ను ఎంపిక చేస్తారు. 2027 ప్రపంచకప్ గెలవాలి అంటే ఆటగాళ్లపై ఒత్తిడి ఉండకూడదు అని భావిస్తున్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ విషయంలో బోర్డు పెద్దలకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందు గిల్ కు బాధ్యతలు అప్పగించాలని భావించినా.. పంత్ కూడా సమర్థవంతమైన కెప్టెన్ కాబట్టి అతనికి అవకాశం ఇచ్చేదిశగా అడుగులు వేస్తున్నట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్