Friday, September 12, 2025 10:55 AM
Friday, September 12, 2025 10:55 AM
roots

ఇలా అయితే కష్టం.. చంద్రబాబు సీరియస్..!

నేను చెప్పింది ఏమిటీ.. మీరు చేస్తుంది ఏమిటి.. ఇలా అయితే నా వల్ల కాదు.. నేను భరించలేను.. ఇది ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. గతానికి భిన్నంగా ఓ విజన్‌తో ముందుకు వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. 2014-19 మధ్య జరిగిన తప్పులు మరోసారి రిపీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత జులై 1న మంగళగిరిలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత జరిగిన సభలో.. 1995 సీబీఎన్‌ను చూస్తారు.. దిస్ ఈజ్ సీబీఎన్ 4.0 అని వార్నింగ్ కూడా ఇచ్చారు. చెప్పినట్లుగానే పనులు పూర్తి చేసేందుకు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు కూడా.

Also Read : పులివెందుల సిత్రాలు.. మళ్లీ అదే ప్రయత్నం..!

2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ప్రాజెక్టులు పూర్తి చేయాలని చంద్రబాబు టార్గెట్ పెట్టుకున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులను 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు కార్యచరణ రూపొందించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి అయ్యేలా చంద్రబాబు ఇప్పటికే ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగానే నిర్మాణ సంస్థలు కూడా శరవేగంగా పనులు చేస్తున్నాయి. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు గేట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పోలవరం పనులకు ఎలాంటి ఇబ్బందులు లేవు.

ఇదే సమయంలో మరో మేజర్ ప్రాజెక్టు విషయంలో మాత్రం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి పనులు నత్త నడకన నడుస్తున్నాయా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధానంగా మంత్రి నారాయణ పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఇందుకు ప్రధానంగా సీఆర్‌డీఏ భవన నిర్మాణమే కారణమంటున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ భవనం ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఆగస్టు 15న ప్రారంభం అనే పుకార్లు వినిపించినప్పటికీ.. అది జరగటం లేదని తేలి పోయింది.

Also Read : అమెరికా టూర్ కు మోడీ.. ట్రంప్ తో భేటీ..?

అమరావతిలో నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయని.. అమరావతి ముంపు ప్రాంతమని.. విపక్షాలు పదే పదే విమర్శలు చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కూడా.. ఇప్పటి వరకు కనీసం ఒక్క పని కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సీఆర్‌డీఏ భవనం ఎప్పుడు పూర్తి చేస్తారని నిలదీసినట్లు తెలుస్తోంది. మీ వల్ల కాదంటే చెప్పండి.. అని కూడా చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలా అయితే కష్టం అన్నారట. 2019 మే నాటికి తుది దశకు చేరుకున్న నిర్మాణాలను ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు సహా ఇతర భవనాల నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభిస్తారు.. ఇప్పుడు అవి ఏ దశలో ఉన్నాయో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రతి రోజు ప్రస్తుత సీఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్తున్న మంత్రి నారాయణ.. అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెలలోనే సీఆర్‌డీఏ భవనం ప్రారంభించి.. దసరా నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు సాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారాయణ.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్