కడప జిల్లాలో ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కేవలం స్థానిక ఎన్నికలు మాత్రమే కాదు, ఇది రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ-వైసీపీల మధ్య జరుగుతున్న ఒక యుద్ధం. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సొంత నియోజకవర్గంలో టీడీపీ గెలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, వైసీపీ తమ పట్టు నిరూపించుకోవడానికి సర్వశక్తులూ ప్రదర్శిస్తుంది. ఎన్నికల ప్రచారం ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి రేపు జరగబోయే పోలింగ్‌పైనే ఉంది. ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి? పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? ప్రజలు ఏమనుకుంటున్నారు?
Also Read : పాకిస్తాన్ ను ఓ ఆట ఆడేసాం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వాలని టీడీపీ కృషి చేస్తోంది. ఎన్నికలు సజావుగా జరగాలని, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తూ, ఓటర్ల సమస్యలు తెలుసుకుంటోంది. ఓటర్లు చెబుతున్నదేమిటంటే.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పక్షపాతంగా వ్యవహరించి, ప్రతిపక్ష అభ్యర్థులను పోటీ చేయనివ్వలేదు. జెడ్పీటీసీ అభ్యర్థులను కూడా నిరోధించే పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఇలాంటి అన్యాయాలు జరిగాయంటున్న ఓటర్లు.. ఈసారి మాత్రం మార్పు కావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఇంట్లో కూటమి సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటున్నారనేది సర్వే సంస్థల నివేదిక. 30 ఏళ్లుగా కాంగ్రెస్, వైసీపీ ఆధిపత్యంలో ఉన్న ఒంటిమిట్టలో ఈసారి టీడీపీ గెలుస్తుందనే మాట బాగా వినిపిస్తోంది.
Also Read : రోజాకు మ్యూజిక్ స్టార్ట్.. పక్కా ప్రూఫ్స్ తో దొరికారా..?
వైసీపీ నాయకుల అవినీతిని ఆధారాలతో సహా ఈడీ, సీబీఐ, ఏసీబీ వంటి సంస్థలు బయటపెడుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సంస్థల విచారణల ద్వారా ప్రజలకు నిజానిజాలు తెలుస్తున్నాయని, వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయనేది సర్వే సంస్థల నివేదిక. ఒంటిమిట్టలో టీడీపీ తరఫున అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ తరఫున ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు. ఒంటిమిట్ట మండలంలో మొత్తం 13 పంచాయతీలున్నాయి. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలో గెలుపు బాధ్యతను స్థానిక శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికే జగన్ అప్పగించారు. ఆయనే ఒంటిమిట్ట మండలంలో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం సహా ఇతర ఖర్చులన్నీ చూసుకుంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ తరఫున జిల్లా నేతలతో పాటు పలువురు మంత్రులు, టీడీపీ నేతలు కూడా ఒంటిమిట్టలో ప్రచారం చేశారు. ఇక్కడ టీడీపీ గెలుపు ఖాయమని.. స్థానిక ఎమ్మెల్యే పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటున్నాయి సర్వే సంస్థల రిపోర్టు. ఈ ఏడాది సీతారాముల కల్యాణం అత్యంత రమణీయంగా నిర్వహించారు. ఒంటిమిట్ట ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది కూడా.
Also Read : కృష్ణా నదికి వరద ఫుల్.. బెజవాడకు వర్షం నిల్..!
ఇక పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికపై రెండు పార్టీలు దృష్టి సారించాయి. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం కావడంతో, గెలుపు ఇక్కడ అత్యంత కీలకం. గతంలో జగన్ ప్రభావాన్ని ఇక్కడ ఎవరూ సవాలు చేయలేదు. అందుకే వరుసగా 4 సార్లు ఇక్కడ ఎన్నిక ఏకగ్రీవం. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ, పులివెందుల కోటలో తమ జెండా ఎగురవేయాలని గట్టి పట్టుదలతో ఉంది. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. లతారెడ్డి గెలుపు కోసం బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి వంటి కీలక నేతలు రంగంలోకి దిగారు. ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిశారు. వైసీపీ తరఫున మాజీ సీఎం జగన్ ఆదేశాలతో ఎంపీ అవినాష్ రెడ్డి నేతృత్వంలో వ్యూహాలు రూపొందించారు. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కడప మేయర్ సురేశ్ బాబు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కొన్ని ఉద్రిక్త ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇది రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. చాలా కాలం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయనున్నారు. పులివెందులలో వైసీపీ అభ్యర్థి గెలుపు కష్టమనే మాట వినిపిస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1400 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.