ఇంగ్లాండ్ టూర్ గురించి చెప్పుకోవాలంటే భారత క్రికెట్ జట్టుకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అత్యంత కీలకంగా భావించే ఈ టూర్ లో భారత్ సీరీస్ ను సమం చేసిన విధానం ఓ అద్భుతం అయితే, భారత బ్యాటింగ్ మరింత అద్భుతం అనే చెప్పాలి. బౌలింగ్ లో బూమ్రా మీదనే భారత విజయాలు ఆధారపడలేదు. కీలకమైన సమయంలో ఇతర బౌలర్ లు రాణించడం భారత్ కు కలిసి వచ్చిన అంశంగా చెప్పాలి. సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ కృష్ణ అద్భుతమైన ప్రదర్శనలు చేసారు ఈ సీరీస్ లో.
Also Read : ట్రంప్ పై స్వదేశంలో తీవ్ర విమర్శలు.. భారత్ కు మద్దతుగా కామెంట్స్
శుభ్‌మన్ గిల్ (754), కెఎల్ రాహుల్ (532), రవీంద్ర జడేజా (516), రిషబ్ పంత్ (479) టాప్ ఫోర్ స్కోరర్లుగా నిలిచారు. చివరి టెస్ట్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ సీరీస్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసినా మధ్యలో కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ ఐదు మ్యాచ్‌ల్లో 411 పరుగులు చేశాడు. అతను రెండుసార్లు డకౌట్ అయినా.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు చేసాడు. దీనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేసాడు. జైస్వాల్ పై ప్రసంశలు కురిపించాడు.
Also Read : లక్షల టన్నుల బంగారం.. ఇండియాలో భారీగా నిక్షేపాలు
జైస్వాల్ రూపంలో భారత్ కు మరో సెహ్వాగ్ దొరికాడు అని కామెంట్ చేసాడు. క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్ లో మాట్లాడుతూ.. అతను బ్యాటింగ్ మొదలుపెట్టే విధానం చూస్తే సెహ్వాగ్ గుర్తుకు వస్తున్నాడని, చాలా డేంజర్ ఆటగాడు అంటూ కీర్తించాడు. రెండవ ఇన్నింగ్స్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అని కీర్తించాడు. అతను ఇంకా మెరుగు అవుతాడని, సెహ్వాగ్ మాదిరిగానే ఆడతాడు అని ఆశాభావం వ్యక్తం చేసాడు. అతనికి లాంగ్ కెరీర్ ఉంటుంది అన్నాడు. సిరాజ్ తో పాటు జైస్వాల్ కు ఓవల్ లో సమాన గౌరవం దక్కాలన్నాడు.