Sunday, October 19, 2025 03:44 PM
Sunday, October 19, 2025 03:44 PM
roots

కుక్కలపై పగ.. కనపడిన కుక్కను కాల్చేసాడు

సైకోలు పలు రకాలు.. చిన్న పిల్లలను బాధ పెట్టేవారు కొందరు, జంతువులను ఇబ్బంది పెట్టేవారు కొందరు, ఏదోక రూపంలో తమ శాడిజం బయటపెడుతూ ఉంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే గుండె జల్లుమంటుంది. ఒక వ్యక్తి కుక్కల మీద పగబట్టి వాటిని కాల్చి చంపాడు. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ఆగస్టు 2 మరియు 3 తేదీల్లో కేవలం రెండు రోజుల్లోనే 25 కి పైగా కుక్కలను కాల్చి చంపిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. దుమ్రాలో నివాసం ఉండే షియోచంద్ బవేరియా అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు.

Also Read : సుందర్ పై ఆసిస్ దిగ్గజాల ప్రశంశలు..!

బహిరంగంగా తిరుగుతూ.. కనపడిన వీధి కుక్కలను కాల్చి చంపుతున్నట్లు ఓ వీడియో వైరల్ అయింది. వీధుల్లో పొలాల్లో కుక్కల మృతదేహాలు అత్యంత దారుణంగా కనిపించాయి. ఆ ఫుటేజ్‌లో వేరే మోటార్‌సైకిల్‌పై వెళుతున్న మూడవ వ్యక్తి పాక్షికంగా కనిపిస్తున్నాడు, ఆ వ్యక్తి ఆ ఇద్దరి వెనుక నడుస్తూ సంఘటనను రికార్డ్ చేస్తున్నాడు. ఈ వ్యక్తి నేరానికి పాల్పడ్డాడా లేదా అనేది అధికారులు తేల్చే పనిలో పడ్డారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే తాము విచారణ ప్రారంభించామని స్థానిక అధికారులు వెల్లడించారు.

Also Read : చీరతో అడ్డంగా దొరికిపోయిన ప్రజ్వల్..!

ఆగస్టు 4న దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు సూపరింటెండెంట్ బ్రిజేష్ జ్యోతి ఉపాధ్యాయ్ తెలిపారు. బవేరియాపై భారత శిక్షాస్మృతి, ఆయుధ చట్టాల కింద కేసు నమోదు చేసారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతనికి ఎవరైనా స్థానికులు సహకరించారా లేదా అనే దానిపై ఆరా తీస్తున్నారు. కుమావాస్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు నిందితుడుని తీవ్రంగా శిక్షించాలని కోరుతూ.. కుక్కలకు గ్రామంలో సామూహిక అంత్యక్రియలు ఏర్పాటు చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్