పాన్ ఇండియా స్టార్లు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లు నటించిన వార్ 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ఈ ఇద్దరు స్టార్లు.. పాన్ ఇండియా లెవెల్ లో ఎలాగైనా హిట్ కొట్టాలని తీవ్రంగా కష్టపడ్డారు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఇటీవల రిలీజ్ అయి.. విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే ఎన్టీఆర్.. రేంజ్ ఖచ్చితంగా మారుతుంది. బాలీవుడ్ తో పాటుగా ఇతర భాషల్లో కూడా భారీ సినిమాలు చేసే ఛాన్స్ రావొచ్చు అని ఫ్యాన్స్ ఆశలుపెట్టుకున్నారు.
Also Read : ఏమయ్యారు వాళ్లంతా.. ప్రజలు మర్చిపోయారా..?
భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై నిర్మాత ఆదిత్యా చోప్రా పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టుగానే కనపడుతోంది. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా భారీ రిలీజ్ ప్లాన్ చేసినట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తం 7500 స్క్రీన్స్ లో సినిమాను విడుదల చేస్తారు. ఇదిలా ఉంచితే లేటెస్ట్ గా ఫ్యాన్స్ కు సినిమా యూనిట్ షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి ఒక సాంగ్ లో డాన్స్ చేస్తారు. బాలీవుడ్ లో హృతిక్ లో, టాలీవుడ్ లో ఎన్టీఆర్.. డాన్స్ లో కింగ్ సైజ్. దీనితో ఈ సాంగ్ యూట్యూబ్ లో వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.
Also Read : అమెరికా బుద్ధి బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ.. సంచలన క్లిప్ వైరల్
కాని.. థియేటర్ లోనే ఈ సాంగ్ చూడాలని, ఫ్రీగా చూపించేది లేదని సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. జస్ట్ కొన్ని క్లిప్స్ మాత్రమే రిలీజ్ చేస్తామని తెలిపింది. వార్ 2 చూడటానికి ప్రజలను థియేటర్లలోకి తీసుకురావాలని, ఇద్దరి డాన్స్ మ్యాజిక్ చూడటానికి ప్రేక్షకులు థియేటర్ కు రావాలని ఆదిత్యా చోప్రా ప్లాన్ చేసినట్టు నేషనల్ మీడియా పేర్కొంది. వార్ 2 కోసం ఆదిత్య తన హిట్ మ్యూజిక్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడని, ఈ సినిమాలో కూడా అలాగే ప్లాన్ చేసినట్టు తెలిపింది.