Friday, September 12, 2025 08:42 PM
Friday, September 12, 2025 08:42 PM
roots

టి20 జట్టులోకి సీనియర్లు..? గిల్ రీ ఎంట్రీ ఖరారు..?

ఇంగ్లాండ్ తో వారి దేశంలో జరిగిన టెస్ట్ సీరీస్ లో భారత్ అద్భుతమైన ప్రదర్శన చేయడంతో సెలెక్షన్ కమిటీ ఇప్పుడు ఆసియా కప్ మీద దృష్టి సారించింది. ఆసియా కప్ లో విజయం సాధించడానికి బలమైన జట్టును ఎంపిక చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ గుడ్ న్యూస్ చెప్పాడు. తిరిగి టి20లలో అడుగుపెట్టేందుకు సిద్దంగా ఉన్నట్టు బోర్డుకు తెలిపాడు. ఆగస్టు మూడవ వారంలో ఆసియా కప్ కోసం భారత్ జట్టును ఎంపిక చేయనున్నారు. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేయడం దాదాపు ఖాయమే.

Also Read : ఉక్కిరి బిక్కిరి అవుతోన్న కేసీఆర్.. ఏం జరుగుతోంది..?

గిల్ చాలా కాలంగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు. గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్న జట్టులో కూడా భాగం కాలేదు. ఈ టోర్నమెంట్ తర్వాత శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో అతను చివరిసారి కనిపించాడు. అప్పటి నుండి వరుసగా మూడు టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ కు దూరమయ్యాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టుల తర్వాత ఐదు వారాల విరామంతో, గిల్ మరియు యశస్వి జైస్వాల్ ఇద్దరూ తిరిగి పొట్టి ఫార్మాట్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని జాతీయ మీడియా వెల్లడించింది.

Also Read : బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా..?

ప్రస్తుతం టి20 లలో అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ కీలకంగా ఉన్నారు. గిల్, జైస్వాల్ జట్టులోకి వస్తే వారికి చోటు కష్టమే. ఇక ఐపిఎల్ లో అదరగొట్టిన ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా జట్టులో చేరే అవకాశం ఉండవచ్చు. గిల్, సాయి సుదర్శన్, గుజరాత్ టైటాన్స్ లో ఓపెనర్లు గా ఉన్నారు. అటు మహ్మద్ సిరాజ్, బూమ్రా, అర్షదీప్ సింగ్ కూడా టి20 జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులోకి వచ్చే అవకాశం ఉందంటున్నాయి క్రికెట్ వర్గాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్