వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసే కామెంట్స్ ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. తాను ఒక్కడినే రాజకీయాల్లో విలువలు కాపాడే నాయకుడిగా తనను తాను చూపించుకునే ప్రయత్నం జగన్ చేస్తూ ఉంటారు. తాను 2019 నుంచి 2024 వరకు చేసిన కార్యక్రమాలు మర్చిపోయిన జగన్.. ప్రస్తుత ప్రభుత్వానికి నీతులు చెప్తూ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. పార్టీ నాయకులతో, సోషల్ మీడియాలో, మీడియా సమావేశాల్లో జగన్.. తన పాలనను స్వర్ణయుగంగా చూపించుకునే ప్రయత్నాలు చూస్తూనే ఉన్నాం.
Also Read : ఎమ్మెల్యే కూన రవికుమార్ తో బోస్టన్ ప్రవాసాంధుల ఆత్మీయ సమావేశం
తాజాగా న్యాయవాదులతో జగన్ ఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. మాట్లాడిన జగన్, చంద్రబాబు పాలన చూస్తే ఇది నిజంగా కలియుగమే అనే భావన కలుగుతోందని, రాక్షస పాలన చేస్తున్నారు అంటూ మండిపడుతూ.. అరెస్ట్ ల గురించి ఓ కామెంట్ చేసారు. ఒకరిని అరెస్ట్ చేయడం అంటే వారి పరువు ప్రతిష్టలను తీయడమే అని, వారి వ్యక్తిగత జీవితాన్ని అవమానించడమేనని ఆవేదనగా మాట్లాడారు. తప్పుడు సాక్ష్యాలను సృష్టించి, లేని ఆధారాలను చూపించి అరెస్ట్ లు చేస్తున్నారని విమర్శించారు.
Also Read : రేషన్ అక్రమాలతో తలనొప్పి.. రెచ్చిపోతున్న మాఫియా..!
ఆ కామెంట్స్ చూసిన వాళ్ళు షాక్ అయ్యారు. జగన్ పాలనలో అచ్చేన్నాయుడు అరెస్ట్ నుంచి చంద్రబాబు అరెస్ట్ వరకు.. ఒక్కటంటే ఒక్క చార్జ్ షీట్ కూడా లేకుండా అరెస్ట్ లు జరిగాయి. ఎస్సీ నేతలు వంగలపూడి అనిత, తెనాలి శ్రావణ్ కుమార్ వంటి వారిపై ఎస్సీ కేసులు నమోదు చేసారు. ధూళిపాళ్ళ, అయ్యన్నపాత్రుడు వంటి వారిని అక్రమంగా అరెస్ట్ లు చేసారు. మహిళా నేతలను బెడ్ రూమ్ లోకి వెళ్లి అరెస్ట్ లు చేసిన పాలన కూడా చేసారు అని టీడీపీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తూ ఉంటారు. వీటిని చూసిన సోషల్ మీడియా జనాలు.. జగన్ కు అల్జీమర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని, కామెడి కామెంట్స్ అవుతున్నాయని వైసీపీ నేతలు కూడా విమర్శించడం గమనార్హం.