రష్యా వద్ద నుంచి భారత్ ఆయిల్ నిల్వలను కొనుగోలు చేయడాన్ని ఏ రూపంలో కూడా జీర్ణించుకోలేక ఇబ్బంది పడుతోన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. సుంకాల రూపంలో భారత్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. దీనితో ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది. రష్యా కు భారత్ కు మధ్య దశాబ్దాల స్నేహం ఉంది. అమెరికా భారత్ కు వెన్నుపోటు పొడిచినా రష్యా మాత్రం స్నేహం చేస్తూనే వచ్చింది. అమెరికాలో భారతీయులు ఇబ్బంది పడుతున్నా.. రష్యాలో మాత్రం భారతీయులకు ఇబ్బంది కలగలేదు.
Also Read : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అబ్బాయిలకు ఇంత ఉపయోగమా..?
దీనితో ఆయుధాలను, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తూ వస్తోంది. దీనితో తన అక్కసు వెళ్లగక్కారు ట్రంప్. ఇదిలా ఉంచితే తాజాగా.. అమెరికాకు ఇండియన్ ఆర్మీ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. మంగళవారం భారత సైన్యం 1971 నాటి పాత వార్తాపత్రిక క్లిప్‌ను షేర్ చేస్తూ అమెరికాపై విమర్శలు చేసింది. భారత సైన్యానికి చెందిన ఈస్ట్ కమాండ్ ఈ క్లిప్ ను షేర్ చేసింది. ఈ క్లిప్ ఆగస్టు 5, 1971 నాటిది. 1971 యుద్ధానికి సన్నాహాలు చేస్తూ.. అమెరికా దశాబ్దాలుగా పాకిస్తాన్‌కు ఆయుధాలను ఎలా సరఫరా చేస్తుందో ఇందులో ఉంది.
Also Read : కొత్త రూల్.. అమెరికా వీసా కావాలా..? 15 వేల డాలర్లు కట్టు..!
ఈ రోజు, ఆ సంవత్సరం యుద్ధం ప్రారంభమైంది – ఆగస్టు 5, 1971 అంటూ పోస్ట్ చేసింది. బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ సైన్యం.. సాయుధ దురాక్రమణ నేపథ్యంలో పాకిస్తాన్‌కు ఆయుధాల సరఫరా విషయంలో నాటో.. సోవియట్ యూనియన్‌ను ఏ విధంగా సంప్రదించిందో.. అప్పటి రక్షణ ఉత్పత్తి మంత్రి వీసీ శుక్లా రాజ్యసభకు చెప్పినట్లు వార్తాపత్రిక క్లిప్‌లో ఉంది. సోవియట్ యూనియన్, ఫ్రెంచ్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేయడాన్ని తిరస్కరించినప్పటికీ, అమెరికా తన సహకారాన్ని కొనసాగించిందని ఈ క్లిప్పింగ్ లో ఉంది.