అధికారం కోల్పోయిన నాటి నుంచి సైలెంట్ గా ఉంటున్న భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కాళేశ్వరం కమీషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందించడంతోప్రభుత్వం తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇది ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశం అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పై ఆయన పార్టీ నేతలతో చర్చించారు.
Also Read : సిక్కోలు టీడీపీ ఇంచార్జీ ఎవరో..?
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజలు, రైతులకు కలిగిన ఉపయోగాన్ని మరోసారి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు కేసీఆర్. అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని..కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించిందేనని..దానిపై ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని కేసీఆర్ కామెంట్ చేసారు. కొంతమంది బీఆర్ ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చు అని, భయపడవద్ధని ధైర్యం చెప్పినట్టు సమాచారం. కాళేశ్వరంపై కేబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో చూశాక అధికారికంగా స్పందిద్దామని పార్టీ నేతలకు సూచించారట.
Also Read : ఈ నాయుడు మామూలోడు కాదుగా..!
కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని అని, కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలని కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. ఇక కవిత విషయంలో కూడా సైలెంట్ గా ఉండాలని పార్టీ నేతలకు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అనవసరంగా దూకుడుగా విమర్శలు చేయవద్దని, ఏం జరుగుతుందో చూద్దామని కేసీఆర్ వ్యాఖ్యానించారట. అలాగే జాగృతితో సన్నిహితంగా ఉండే పార్టీ నేతలపై కన్నేసి ఉంచాలని కేసీఆర్ సూచించారట.




