Saturday, October 25, 2025 07:40 PM
Saturday, October 25, 2025 07:40 PM
roots

బెంగళూరులో ఆల్ ఖైదా ఉగ్రవాది.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో కలిసి..!

భారత్ లో ఉగ్రవాద కార్యాకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉగ్రవాదులు స్థావరాలు ఏర్పాటు చేసుకుని, దాడులకు ప్లాన్ చేస్తున్నారనే సమాచారంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇక పాకిస్తాన్ కు ఏజెంట్ లు గా పని చేస్తున్న వారిపై గురిపెట్టి పలువురుని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొందరిని ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ లో ఇటీవల నలుగురిని అరెస్ట్ చేసిన ఉగ్రవాద నిరోధక బృందం ఇప్పుడు మరొకరిని అరెస్ట్ చేసింది.

Also Read : లిక్కర్ కేసులో సంచలనం.. 12 అట్టపెట్టెల్లో భారీగా డబ్బు

గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బెంగళూరులో అల్-ఖైదా ఉగ్రవాది షామా పర్వీన్‌ను అరెస్టు చేసింది. ఆమె సాధారణ పౌరురాలిగా జీవిస్తూ, ఉగ్రవాదులకు సమాచారం పంపిస్తుందని గుర్తించారు. అసలు ఆమె ఎవరు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బెంగళూరు కోర్టు నుండి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని ఆమెను గుజరాత్ కు తరలించారు. 33 ఏళ్ళ షమా.. పలుమార్లు పాకిస్తాన్ కూడా వెళ్లి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. అరెస్టు అయిన షమా పర్వీన్ ది జార్ఖండ్‌ రాష్ట్రంగా గుర్తించారు.

Also Read : భారత్ కు ట్రంప్ దెబ్బ.. టారిఫ్ లతో కొత్త షాక్..?

ఆమె తన సోదరుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో కలిసి బెంగళూరులోని మనోరాయనపాల్య ప్రాంతంలో నివాసం ఉంటుంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, షామా మూడు సంవత్సరాల క్రితం బెంగళూరుకు వచ్చింది. సోషల్ మీడియాలో, ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉగ్రవాద భావజాలానికి బహిరంగంగా మద్దతు ఇచ్చిందని, యువతను ఉగ్రవాదంలో చేరమని ప్రోత్సహించిందని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అరెస్ట్ చేసిన ఉగ్రవాదులకు, ఆమెకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే దానిపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్