వైసీపీ నేతలు చేసిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. సహజ వనరులతో పాటుగా ప్రజా సంపదను దోచుకున్న నేతలపై విచారణకు ఆదేశిస్తోంది. పలువురు మాజీ మంత్రుల అవినీతి వ్యవహారాలను ఇప్పటికే లాగిన సర్కార్.. తాజాగా మరో మాజీ మంత్రిపై కూడా గురి పెట్టింది. వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్‌యాదవ్‌కు ఉచ్చు బిగుస్తోంది. క్వార్జ్ అక్రమ రవాణా కేసులో అడ్డంగా దొరికిన అనిల్‌కుమార్ యాదవ్ ను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కనపడుతోంది.
Also Read : ముంచేసిన మిథున్ రెడ్డి.. జగన్ పని అయిపోయినట్లే
నిన్న హైదరాబాద్‌లో అరెస్టు అయిన అనిల్‌కుమార్ అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డికి కోర్ట్ రిమాండ్ విధించింది. క్వార్జ్ మైనింగ్ స్కామ్‌లో అనిల్‌కుమార్ యాదవ్ పాత్రపై వివరాలు వెల్లడి అయ్యాయి. అనిల్, కాకాణితో నాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి అంగీకరించినట్టు సమాచారం. 2023 ఆగస్టు నుంచి అనిల్, కాకాణితో క్వార్జ్ వ్యాపారం చేశానని అతను అంగీకరించాడు. లీజు గడువు ముగిసిన రుస్తుం మైన్ నుంచి క్వార్జ్ తీశామని.. వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారని అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది.
దీనిని పర్యవేక్షించినందుకు నాకు టన్నుకు రూ.1000 ఇచ్చేవారని వివరించాడు. క్వార్జ్‌ను ఏనుగు శశిధర్‌రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్లమని.. శశిధర్‌రెడ్డికి ఎకరాకు రూ.25 వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు బయటపెట్టాడు. రుస్తుం మైన్ నుంచి తీసిన క్వార్జ్‌ను చైనా పంపామని, దువ్వూరు శ్రీకాంత్‌రెడ్డితో క్వార్జ్‌ను ఎగుమతి చేయించేవాళ్లమని అధికారుల ముందు అంగీకరించాడు. క్వార్జ్‌లో వచ్చిన డబ్బుతో స్థిరాస్తి వ్యాపారం చేశామని.. నేను, అనిల్ కలిసి గూడూరులో 100 ఎకరాల్లో వెంచర్ వేశామని శ్రీకాంత్ రెడ్డి ఒప్పుకున్నాడట.
Also Read : వివేకా కేసు.. సెన్సేషనల్ క్రియేట్ చేయబోతుందా..?
నాయుడుపేట వద్ద 50 ఎకరాల్లో వెంచర్ వేశామని.. హైదరాబాద్‌లోనూ రెండు హౌసింగ్ ప్రాజెక్టులు చేశామని తెలిపాడు శ్రీకాంత్ రెడ్డి. మణికొండ అల్కాపురి, తుర్కయాంజల్‌లో వెంచర్లు వేసినట్టు అతను వివరించాడు. మణికొండ అల్కాపురిలో హెవెన్లీ హోమ్స్ పేరిట వెంచర్ వేసినట్టు తెలిపాడు. తుర్కయాంజల్‌లో గ్రీన్ మెడోస్ పేరిట వెంచర్ వేశామన్నాడు. 2024లో ప్రభుత్వం మారాక హైదరాబాద్‌కు మకాం మార్చానని. కేసులకు భయపడి హైదరాబాద్‌కు మకాం మార్చాను శ్రీకాంత్ రెడ్డి వెల్లడించాడు.