Friday, September 12, 2025 03:00 PM
Friday, September 12, 2025 03:00 PM
roots

లిక్కర్ స్కాంలో 7 డెన్ లు.. హైదరాబాద్ అడ్డాగా ఏపీ లిక్కర్ స్కాం

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రతీ ఆధారాన్ని సేకరిస్తోంది. పాత పాలసీని రద్దు చేసి కొత్త పాలసీ ప్రవేశ పెట్టడం, డిస్టిలరీలను మార్చడం, కొత్త బ్రాండ్ లను ప్రవేశపెట్టడం, ధరలు పెంచడం, ప్రభుత్వం మద్యం విక్రయించడం ఇలా పలు కీలక అంశాలను సిట్ ప్రత్యేకంగా తీసుకుని విచారణ చేస్తోంది. ఊహించని వ్యక్తుల పేర్లు బయటకు రావడంతో ఇంకా ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. తాజాగా ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది సిట్.

Also Read : మిథున్ రెడ్డినే అరెస్ట్ అంటే.. మరి మా సంగతి..? వైసీపీలో భయం భయం

త్వరలోనే మాజీ మంత్రి నారాయణ స్వామిని కూడా విచారించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. 3500 కోట్ల రూపాయల స్కాం గా సిట్ అధికారులు గుర్తించారు. గతంలో కోర్టు చెప్పినా సరే డిజిటల్ పేమెంట్స్ లేకుండానే రాష్ట్రం మద్యం విక్రయించింది. రాజకీయ నాయకులకు లబ్ది చేకూరే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండటం వివాదాస్పదంగా మారింది.

మొత్తం నెలకు రూ.60 కోట్లు చొప్పున లంచాలు చెల్లించడం.. మద్యం విక్రయాల్లో వాటాలు, కమీషన్లు ఇచ్చినట్టు, పుచ్చుకున్నట్టు గుర్తించారు. ఈ స్కాంలో ముడుపులు పంచుకోవడానికి 7 రహస్య ప్రాంతాల్లో డెన్లు ఏర్పాటు చేసారు. సిట్ దర్యాప్తులో అడ్రస్‌లతో పాటు డెన్‌ల ఆచూకీ గుర్తించారు. వాటి అడ్రస్ లు ఒకసారి చూస్తే.. ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఒక్కటి మాత్రమే గుంటూరులో ఉంది.

డెన్ 1: నిర్మితి ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నెం.302 బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12.

డెన్ 2 : శ్రీనివాసం అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నెంబర్ C3, ఫిల్మ్ నగర్.

డెన్ 3 : ప్లాట్ నెంబర్ 42, బ్లాక్-బీ, ఉమా హిల్ క్రెస్ట్ అపార్ట్ మెంట్ ఖాజాగూడ సర్కిల్, రోడ్ నెంబర్.63 A జూబ్లీ హిల్స్, హైదరాబాద్.

Also Read : ఎవరి కొడుకైనా టాలెంట్ ఉండాల్సిందే.. పవన్ సంచలన కామెంట్స్

డెన్ 4 : పడాల్స్ హౌస్, డోర్ నెంబర్ 3-3-111/98, నలంద నగర్, హైదర్ గూడ.

డెన్ 5 : NCC అర్బన్ 1 అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నెంబర్ 1603, 8th బ్లాక్, నార్సింగి.

డెన్ 6 : ఓటు స్కేర్ అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నెంబర్స్ 103, 601, నానక్‌రామ్‌గూడ.

డెన్ 7 : ల్యాండ్‌మార్క్ అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నెం. 312, నవోదయ కాలనీ, గుంటూరులో డెన్ లు ఏర్పాటు చేసారు. ఈ డెన్లలోనే నిర్ణయాలు తీసుకోవడం, ఇచ్చి పుచ్చుకోవడాలు జరిగాయని తేల్చారు. ఆ డెన్ లకు ఎవరెవరు వచ్చేవారు వంటి అంశాలను కూడా సిట్ గుర్తించే పనిలో పడింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్